Man Stucked Between Train And Platform: 'దయచేసి వినండి.. రైలు బండి చలనంలో ఉండగా ఎక్కుట గానీ దిగుట గానీ ప్రమాదకరం' అంటూ రైల్వేస్టేషన్లలో హెచ్చరికలు వినిపిస్తున్నా కొంతమంది పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో (Anakapalle Railway Station) అలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్టేషన్‌లో కదులుతోన్న జన్మభూమి రైలు ఎక్కుతుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రైన్‌కు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, పోలీసులు రైలు నిలిపేసి ప్లాట్ ఫాం తవ్వి బాధితున్ని బయటకు తీశారు. అనంతరం వెంటనే ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రావికమతం మండలం తోటకూరపాలెంకి చెందిన పైలా రాజబాబుగా గుర్తించారు.
Anakapally News: రైలు కదులుతుండగా ఎక్కబోయాడు - ట్రైన్‌కు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుపోయాడు, చివరకు!
Anand | 08 Nov 2024 10:20 PM (IST)
Andhra News: కదులుతోన్న రైలు ఎక్కబోయి ఓ వ్యక్తి రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయాడు. రైలును నిలిపేసిన సిబ్బంది ప్లాట్ ఫాం తవ్వి అతన్ని బయటకు తీశారు.
రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకున్న వ్యక్తి
Published at: 08 Nov 2024 10:20 PM (IST)