News
News
వీడియోలు ఆటలు
X

Lokesh Letter :పసుపు, మొక్కజొన్న రైతుల్ని నట్టేట ముంచేస్తారా ? - సీఎం జగన్‌కు లోకేష్ లేఖ !

మంగళగిరి రైతుల్ని ఆదుకోవాలని సీఎం జగన్‌కు లోకేష్ లేఖ రాశారు. పసుపు, మొక్క జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

 

Lokesh Letter :  అకాల వర్షాలతో పాటు పంటలను కొనుగోలు చేయనికారణంగా  నష్టపోయిన రైతులను  ఆదుకోవాలని సీఎం జగన్‌కు..టీడీపీ నేత లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల వర్షాల ధాటికి రైతులు విలవిల్లాడుతూంటే.. ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదని..  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అనేది మ‌రో సారి గుర్తు చేస్తున్నానని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు.  రైతుల పంట‌లు కొనుగోలు బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని ప్ర‌క‌టించి ప‌ట్టించుకోకపోతే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు..ఎన్నిక‌ల‌కి ముందు మీ మాయ మాట‌లు న‌మ్మిన రైతాంగం ఇంకా అవే భ్ర‌మ‌ల్లో ఉన్నారని, త‌మ వ‌ద్ద‌కే వ‌చ్చి మ‌ద్ద‌తు ధ‌ర‌కి పంట‌లు కొనుగోలు చేసి స‌కాలంలో డ‌బ్బులు కూడా చెల్లించేస్తార‌నే ఆశ‌లు నాలుగేళ్లుగా ఆడియాశ‌ల‌వుతూనే ఉన్నాయన్నారు. 

 

 

దుగ్గిరాల పసుపు యార్డులో కొనుగోళ్లు జీరో 

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో దేశంలోనే పేరొందిన దుగ్గిరాల ప‌సుపు మార్కెట్ యార్డు నుంచి వైసీపీ  ప్ర‌భుత్వం చేసిన ప‌సుపు కొనుగోలు నేటికి  గుండు  సున్నా అని విమర్శించారు. టిడిపి ప్ర‌భుత్వం 2017లో క్వింటా రూ.6500 చొప్పున మొత్తం ప‌సుపు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో  అధికారంలోకి వ‌చ్చిన తరువాత 2020లో క్వింటాకి రూ. 6850 మ‌ద్ద‌తు ధ‌ర‌తో కేవ‌లం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన వారి వ‌ద్దే నుండే ప‌సుపు కొనుగోలు చేశారన్నారు.  క‌రెంటు చార్జీలు, పెట్రోల్,డీజిల్ రేట్లు, కూలీ ఖ‌ర్చులు, ఎరువులు, పురుగుమందుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి పెట్టుబ‌డి వ్య‌యాలు రెండింత‌లు అయ్యాయని, ఈ ఏడాది వ‌ర్షాల వ‌ల్ల ప‌సుపు   రంగు మార‌డంతో మ‌రీ దారుణంగా  క్వింటా రూ.3500-4500 రేటు అంటూ రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎకరాకి 75వేలు పెట్టుబ‌డి  అయినప్పుడు మ‌ద్ద‌తు ధ‌ర రూ. 6850  ఉంటే, అన్ని రేట్లూ పెరిగి ఎక‌రాకి ల‌క్షా 50 వేలు పెట్టుబ‌డి పెట్టిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గిట్టుబాటు ధ‌ర గ‌రిష్టంగా రూ.4500 దాట‌క‌పోవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం స్పందించి మార్క్ ఫెడ్ ద్వారా ప‌సుపు, క‌టుకు ప‌సుపుకి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి కొనుగోలు చేయాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు.

మార్క్ ఫెడ్ ద్వారా పసుపునుకొనుగోలు చేయాలి!

గ‌రిష్టంగా ప‌సుపు క్వింటాకి రూ.10వేలు మ‌ద్ద‌తు ధ‌ర‌గా ఇస్తే లాభం ఉంటుందని, అదే విదంగా న‌ష్టాల మాట ఉండ‌దని లోకేష్ సూచించారు.  మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు మూడు వేల ఎక‌రాల‌లో ప‌సుపు పండిస్తే, ఒక్క క్వింటా ప‌సుపు కొనుగోలు చేసిన పాపాన పోలేదన్నారు. దుగ్గిరాల మార్కెట్ ప‌రిధిలో 20 వేల ఎక‌రాలలో పండే 4 ల‌క్ష‌ల బ‌స్తాల‌ ప‌సుపు ఇంకెప్పుడు కొంటారో ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నామని , ఏప్రిల్ మొద‌టివారం నుంచి ప‌సుపు కొనుగోలు చేస్తామ‌ని, ఆర్బీకేలో న‌మోదు చేసుకోవాల‌ని ప‌సుపు రైతులకు జాయింట్ క‌లెక్ట‌ర్ చేసిన   ప్ర‌క‌ట‌న కేవలం కాగితాలకే పరిమితం అయ్యిందన్నారు. ఏప్రిల్ వెళ్లిపోయి మే నెల‌ వ‌చ్చినా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ‌క‌పోవ‌డం రైతులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారని,త‌క్ష‌ణ‌మే ప‌సుపుని రూ.10000 మ‌ద్ద‌తు ధ‌ర‌తో కొనుగోలు చేయాల‌ని కోరుతున్నామని చెప్పారు. 

మొక్క జొన్న రైతుల్ని గాలికి వదిలేస్తారా?

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మొక్క‌జొన్న కూడా కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో రైతులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారని, దాదాపు 25 వేల ఎక‌రాలలో మొక్క‌జొన్న పండిందని తెలిపారు.ఎక‌రాకి పెట్టుబ‌డి రూ.30 వేలు దాటిపోయిందని, పంట దిగుబ‌డి త‌గ్గిపోవటం, వ‌ర్షాల‌కు మొక్క‌జొన్న నాణ్య‌త త‌గ్గింద‌ని తెలిపారు. ధ‌ర త‌గ్గించి రూ.1500నుంచి రూ.1600కి కొంటున్నారని. ఈ సంక్షోభ స‌మ‌యంలో మొక్క‌జొన్న‌కి ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రూ.1962 ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ఉందని సూచించారు. వైసీపీ స‌ర్కారు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భ‌రోసా కేంద్రాల వైఫ‌ల్యం రైతుల పాలిట శాపంగా మారిందని,  అకాల వ‌ర్షాల‌తో న‌ష్టం, మ‌రోవైపు మ‌ద్ద‌తు ధ‌ర లేక‌పోవ‌డం, ఇంకోవైపు పంట‌ని కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో మొక్క‌జొన్న‌, ప‌సుపు రైతులు ఆందోళ‌న బాట‌ప‌డుతున్నారని తెలిపారు. పార్టీలు చూడ‌కుండా రైతులంద‌రి నుంచీ ప‌సుపు, మొక్క‌జొన్న పంట‌ల‌ని మ‌ద్ద‌తు ధ‌ర‌తో కొనుగోలు చేసి వెంట‌నే చెల్లింపులు చేయాల‌ని కోరుతున్నామని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

 

Published at : 02 May 2023 05:58 PM (IST) Tags: Nara Lokesh AP Updates LOKESH LETER TO CM

సంబంధిత కథనాలు

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Minister Peddireddy: ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

AP Minister Peddireddy: ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

విశాఖలో పెట్టుబడులు, పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?