Lokesh Fires On CM Jagan In Bheemili : రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖారావం పేరుతో సభలను నిర్వహిస్తూ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా యువత నేత నారా లోకేష్ భీమిలిలో శనివారం సాయంత్రం నిర్వహించిన సభలో సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్ అన్న నారా లోకేష్.. మరోసారి అధికారంలోకి వస్తే ఇంటి పై కప్పు కూడా దోచేస్తారని ఆరోపించారు. నా బీసీ, నా ఎస్సీ అంటూ ప్రేమ కురిపించిన జగన్మోహన్‌రెడ్డి.. వారికి తీవ్ర అన్యాయం చేశాడని ఆరోపించారు. ఎంతో మంది దళిత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
62 మంది ఎమ్మెల్యేలు, 16 ఎంపీలను ఒకచోట నుంచి మరొక చోటకు మార్చారని, అందులో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలే ఉన్నారన్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు అందాల్సిన 27 పథకాలను రద్దు చేశారని, వారికి స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించడంతో 16,500 మంది పదవులకు దూరమయ్యారన్నాని ఆరోపించారు. 27 వేల మంది బీసీలపై కేసులు నమోదు చేయించారని ఆరోపించారు.
అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితిలో వైసీపీ
వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని, ప్రతిచోట అభ్యర్థులను వెతుక్కుంటున్నారన్నారు. తాను బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని, జగన్ మాత్రం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రజల్లో తిరుగుతుంటే, జగన్ మాత్రం పరదాల మాటున పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రిగా తాను టీసీఎల్, హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్, జోహో వంటి పరిశ్రమలను విశాఖకు తెచ్చానని, జగన్ బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వంటి మద్యం బ్రాండ్లు తీసుకువచ్చాడని విమర్శించారు. తనది స్టాన్‌ఫర్డ్ ఎంబీఏ అయితే, జగన్‌ది పదో తరగతి పేపర్ లీకేజీ చదువు అని లోకేష్ దుయ్యబట్టారు. జగన్ పెద్ద కటింగ్ మాస్టర్ అని విమర్శించిన లోకేష్.. పచ్చ బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే, రెడ్ బటన్ నొక్కి వంద లాగేస్తున్నాడంటూ లోకేష్ సెటైర్లు వేశారు.
ఉత్తరాంధ్ర ప్రజలు జగన్‌పై తిరగబడే రోజులు వచ్చాయని, రెండు నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొడతారన్నారు. నవరత్నాలు పేరుతో నమో మోసాలకు జగన్మోహన్‌రెడ్డి పాల్పడ్డాడని, తాము హామీ ఇస్తున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. కార్యకర్తలు జోలికి వచ్చిన వారిని విడిచిపెట్టేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఎర్రబుక్ చూస్తే వైసీపీ నేతలకు ఉచ్చ పడుతోందని, దీనిపై కూడా కోర్టుకు వెళుతున్నారని ఆరోపించారు లోకేష్.
అవంతిపైనా హాట్ కామెంట్స్
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపైనా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. అవంతి వీడియోలు బయటకు వచ్చాయని, ఇక్కడి నుంచి ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లి భీమిలి నుంచి వచ్చామని చెబితే.. ఆ వీడియోలు తాము చూశామనే పరిస్థితి వచ్చిందన్నారు. భీమిలి పరువు తీసిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని లోకేష్ విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు వేయి కోట్ల భీమిలిని తాము అభివృద్ధి చేస్తే.. ఇక్కడున్న ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన అర గంట అవంతి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలిచ్చే ఆవును వద్దనుకుని, తన్నే దున్నపోతును ఇక్కడ ప్రజలు గెలిపించుకున్నారని, మీ జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా..? అని లోకేష్ ఈ సందర్భంగా ప్రజలను ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకుని అర గంట అవంతికి రాసలీలు తెలుసని, షర్ట్ తీసి వీడియో కాల్స్ మాట్లాడడం తెలుసని విమర్శించారు. అరగంట అవంతి అవుట్ సోర్సింగ్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులను అమ్ముకున్నాడని, చిట్టివలస జ్యూట్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీసుకుని కార్మికులకు న్యాయం చేయలేదని ఆరోపించారు.