Lakshmi parvati said that people are not supporting TDP  :  రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం కోల్పోవడంపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు.  నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు బ్రష్టు పట్టించారని విమర్శించారు.  గతంలో పార్టీకి ఉన్న వైభవం, ఉత్సాహం ఇప్పుడు లేదన్నారు.  22 మంది ఎంపీలుగా ఉన్న టీడీపీని రాజ్యసభ కు ఒక్కరినీ కూడా పంపలేని దౌర్భాగ్య పరిస్థితి పట్టిందని విమర్శించారు.  కేవలం తండ్రీ కొడుకుల కోసమే పార్టీని నడిపిస్తున్నారని..  అందుకే ప్రజలు టీడీపీని చీ కొడుతున్నారన్నారు.  రాష్ర్టం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడుని, లోకేష్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  పవన్ కళ్యాణ్ అమాయకుడు, పిచ్చోడు  ..ఆయన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు.  కాపులు ఏమీ అంత తెలివి తక్కువ వారు కాదు, పవన్ కళ్యాణ్ ను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు.  


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎదుర్కోనంత పెద్ద కష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. గతంలో ఘోర పరాజయాలు ఎదురైనా.. ఒకటో, రెండో రాజ్యసభ సీట్లు వచ్చేవి. కానీ గత రెండు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూా రాలేదు. దానికి తగ్గ ఎమ్మెల్యేల బలం లేదు. దీంతో టీడీపీకి ఉన్న ఒక్క రాజ్యసభ సభ్యుడి పదవి కాలం ముగిసిపోతోంది. కొత్త అభ్యర్థి ఎంపిక కాలేదు. దీంతో టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయినట్లయింది.                                                     


 టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది.  రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు. ఉమ్మడి రాష్ట్రం విభజన కారణంగా ఏపీకి  రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11గా నిర్ణయించారు.  రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీ  151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమయింది. ఓటమి తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లు బీజేపీలో చేరారు. వారి పదవి కాలం కూడా పూర్తయిపోయింది.  


ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం తలవంపులు తెచ్చిపెట్టేదిగా ఉండేదే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఇలాంటి అరుదైన అనుభవం ఎదురవుతుంది.  రాజ్యసభలో స్థానాల కోసం పార్టీకి కావాల్సిన అర్హత వంటి టెక్నీకల్ అంశాలను పక్కన పెడితే ఈ పరిణామం చాలా వరకూ టీడీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం అనుకోవచ్చు.