Borugadda Anil: రాజమండ్రి నుంచి అర్ధరాత్రి అనంతపురానికి బోరుగడ్డ అనిల్ తరలింపు
Andhra Pradesh News | రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వైసీపీ నేత బోరుగడ్ద అనిల్ ను అనంతపురానికి తీసుకొచ్చారు. శనివారం రాజమండ్రికి వెళ్లి పోలీసులు పర్మిషన్ అనంతరం అర్థరాద్రి ఇక్కడికి తరలించారు.
YSRCP leader borugadda anil shifted to Anantapur police station | అనంతపురం: గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను జడ్జీలను కించపరుస్తూ మాట్లాడాడంటూ వైసిపి నేత బోరుగడ్డ అనిల్ పై అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి కోర్టు హనుమంతులతో మూడు రోజులపాటు నాలుగో పట్టణ పోలీసులు అనిల్ ను విచారించనున్నారు.
వైద్య పరీక్షలు నిర్వహించి అనంతపురానికి తరలింపు
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డ అనిల్ అదుపులోకి తీసుకొని అక్కడే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి అనంతపురానికి పోలీసులు తరలించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కు బోరుగడ్డ అనిల్ తో పాటు పోలీసులు చేరుకున్నారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 179/ 2023 ఐపీసీ సెక్షన్ 79 351 టు 1 9 6 కింద బూరుగడ్డ అనిల్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి సంఘ తేజస్విని ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు.
రేపు కోర్టుకు బోరుగడ్డ అనిల్
బోరుగడ్డ అనిల్ అనంతపురం తీసుకు వస్తున్న క్రమంలో పకడ్బందీగా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి ఎవరిని రానీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్ ఆవరణంలోకి ఇతరులు రాకుండా అనిల్ ను విచారిస్తున్నారు. గతంలో బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులు చేసిన పొరపాటు చేయకుండా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గట్టి చర్యలను చేపట్టారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటివరకు బోరుగడ్డ అని నోరు విప్పలేదని సమాచారం. ఈరోజు రేపు విచారించి రేపు సాయంత్రం కోర్టులో బోరుగడ్డ అనిల్ ను సబ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.