CM Jagan convoy: సీఎం జగన్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ నేతలు-అరెస్ట్‌

సత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ కాన్వాయ్‌ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గో బ్యాక్‌ అంటూ నినదించారు. పలువురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Continues below advertisement

సీఎం జగన్‌(CM Jagan) పర్యటన సందర్భంగా.. శ్రీసత్యసాయి జిల్లా(Sri Satya Sai District)లో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా(YSR Rythu Bharosa) నిధులు విడుదల చేసేందుకు తాడేపల్లి(Tadepalli) నుంచి... ప్రత్యేక విమానంలో  పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఎయిర్‌పోర్టు(Puttaparti Sri Satya Sai Airport)కు చేరుకున్నారు సీఎం జగన్‌. ఎయిర్‌పోర్టులో సీఎంకు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం (Grand Welcome) పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో సభా ప్రాంగణానికి బయల్దేరారు సీఎం జగన్‌. 

Continues below advertisement

మరోవైపు..  జిల్లాలో సీఎం జగన్ పర్యటన నిరసిస్తూ చలో పుట్టపర్తికి పిలుపునిచ్చారు టీడీపీ (Telugu Desam )నేతలు. ఈక్రమంలో పెనుకొండ(Penukonda) దగ్గర నిరసనలు చేప్టటారు. ఈ సమయంలో  సీఎం జగన్‌ కాన్వాయ్‌ రావడంతో.. టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సీఎం గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. పెనుకొండ ఎన్టీఆర్(NTR) కూడలిలో నల్ల బెలూన్లు ఎగురవేసి.. సీఎం గో  బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ(Savitamma) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. 

సీఎం జగన్‌ కాన్వాయ్‌కు టీడీపీ నేతలు అడ్డుపడటంతో... వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను పక్కకు లాగి పడేశారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త  పరిస్థితి కనిపించింది. టీడీపీ నేత సవితమ్మతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం జగన్‌ కాన్వాయ్‌కి మార్గాన్ని క్లియర్‌ చేశారు. ఇక... సీఎం జగన్‌ కాన్వాయ్‌  వెళ్తున్న మార్గంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు... జిల్లాలో సీఎం జగన్ పర్యటన నిరసిస్తూ చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపునివ్వడంతో.. పోలీసులు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. టీడీపీ నేతలను  ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని  అదుపులోకి తీసుకున్నారు. వారిని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్బంధించారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. 

Continues below advertisement