కర్నూలు : కర్నూలులో ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన బైక్ నడుపుతున్న వ్యక్తి మృతిచెందాడు. వి కావేరి ట్రావెల్స్ బస్సును ఢీకొన్న పల్సర్ బైక్ నడిపిన వ్యక్తిని శంకర్ గా గుర్తించారు. కర్నూలులోని ప్రజానగర్ కు చెందిన వ్యక్తి శంకర్ అని పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ట్రావెల్స్ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ క్రమంలో ట్రావెల్స్ కిందకు దూసుకెళ్లిన పల్సర్ బైకును దాదాపు 300 మీటర్ల వరకు ట్రావెల్స్ ఈడ్చుకెళ్లడతోనే ఫ్యూయర్ ట్యాంకు డ్యామేజీ అయి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
పటాన్‌చెరు నుంచి బయలుదేరిన బస్సు
కావేరి ట్రావెల్స్ బస్సు పటాన్ చెరు నుంచి గురువారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరింది. బస్సు నెంబర్ 9490 కాగా, దీనికి ఇద్దరు డ్రైవర్లు లక్ష్మయ్య, శివ ఉన్నారు. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై ట్రావెల్స్ బస్సును బైకు ఢీకొట్టింది. బైకును కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లగా ఫ్యూయల్ డ్యామేజీ కావడంతో మంటలు చెలరేగి ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం కాగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో కొందరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తామని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. కూటమ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు
అశ్విన్‌రెడ్డి(36),జి.ధాత్రి(27), తరుణ్(27), ఆకాశ్(31),గిరిరావు(48),కీర్తి(30)పంకజ్(28), యువన్ శంకర్‌రాజు(22)పిల్వామిన్ బేబి(64),కిశోర్ కుమార్(41),బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27),రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులురమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)సూర్య(24)హారిక(30), శ్రీహర్ష(24),ఎం.జి.రామారెడ్డి(50)ఉమాపతి(32)శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్(27), అమృత్ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24)
బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపాలు..కర్నూల్ బస్సు ప్రమాదంపై కర్నూల్ రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. ట్రావెల్స్ బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలున్నాయని సంచలన విషయాలు వెల్లడించారు. బస్సులు ప్రమాదాలకు గురైతే.. ప్రయాణికుల ప్రాణనష్టం తక్కువగా ఉండేలా బస్సు నిర్మాణంలో మెటీరియల్ వాడలేదన్నారు. ప్రైవేట్ బస్పుల్లో ముందు జాగ్రత్త చర్యలు కూడా లేవంటూ మండిపడ్డారు.
బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలు..పిల్వామిన్ బేబి (64), మహ్మద్ ఖైజర్ (51), అశ్విన్ రెడ్డి(36), ఎంజీ రామారెడ్డి (50), సంధ్యారాణి మంగ (43), కిశోర్ కుమార్ (41), శ్రీనివాస్‌రెడ్డి (40), జీ. ధాత్రి (27), కీర్తి (30), పంకజ్ (28), యువన్ శంకర్ రాజు (22), తరుణ్ (27), ఆకాశ్ (31), బున సాయి (33), గణేశ్ (30), జయంత్ పుష్వాహా (27), రమేశ్ (30), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్ కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం. సత్యనారాయణ (28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), ఉమాపతి (32), సుబ్రహ్మణ్యం (26), కే. అశోక్ (27), వేణుగోపాల్ రెడ్డి (24), చరిత్ (21), చందన మంగ (23), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), సూర్య (24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), అనూష (22), అమృత్ కుమార్ (18), గిరిరావు (18), రమేశ్ అనే వ్యక్తితోపాటు అతని ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. మొత్తం 41 మంది ప్రయాణికులలో 39 మంది పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదం నుంచి బయటపడింది వీరేకర్నూలు : వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురై కాలిపోయిన ప్రమాదంలో ఎమర్జెన్సీ డోర్ అద్దాలు బద్దలుకొట్టి వారు బస్సు నుంచి కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. సత్యనారాయణ, రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నవీన్ కుమార్, అఖిల్, శ్రీలక్ష్మి, హారిక, జష్మిత, అకీర, రమేశ్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.