అన్వేషించండి

Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక

అత్యవసర ద్వారాన్ని మూసేశారు.. అందుకే 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక

అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాల మీదకు ఎలా వస్తున్నాయో వివరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంచలన నివేదికను వెల్లడించింది. గతేడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నిప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవదహనమైన ఘటనపై రవాణాశాఖ ఆదేశాల మేరకు ఆస్కీ సమగ్ర అధ్యయనం చేపట్టింది. ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యవసర ద్వారాన్ని (Emergency Door) మూసేశారు.. అందుకే 19 ప్రాణాలు పోయాయని కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదికలో పేర్కొంది.

ఈ నివేదికలోని అంశాలు బస్సు యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఆ బస్సుకు కేవలం సీటింగ్ బస్సుగా మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా 53 సీట్లను తొలగించి 43 స్లీపర్ బెర్తులుగా మార్చారు. 2023 మార్చిలో ఈ మార్పులు చేసిన సమయంలో అత్యవసర ద్వారానికి (Emergency Exit) అడ్డంగా ఇనుప పైపులతో నిర్మాణం చేపట్టారు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆస్కీ తన నివేదికలో స్పష్టం చేసింది.

అంతేకాకుండా, ఈ ప్రైవేట్ బస్సులో భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఆన్-బోర్డ్ కమ్యూనికేటర్ వ్యవస్థను తొలగించడంతో పాటు, డ్రైవర్ వైపు ఉన్న డోర్‌ను మూసివేసి బోల్టు బిగించారు. నిబంధనల ప్రకారం బస్సులో వాణిజ్య సరకు రవాణా చేయకూడదు, కానీ ఈ బస్సులో ఎల్పీజీ సిలిండర్లు, లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన సెల్‌ఫోన్ పార్శిళ్లను రవాణా చేసినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు గంటకు 86 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, రోడ్డుపై పడి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఢీకొట్టడం వల్లే ఈ ఘోరం జరిగిందని నివేదిక పేర్కొంది.

తనిఖీ అధికారుల వైఫల్యాన్ని కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది. ఈ బస్సుకు గతంలో డమన్- డయ్యులో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేసినా, బస్సులో చేసిన మార్పులను అధికారులు గుర్తించలేదు. అనంతరం ఒడిశాలో రీ-రిజిస్ట్రేషన్ జరిగినా, ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ నిబంధనల ప్రకారం హోమ్ స్టేట్‌కు వెళ్లాల్సి ఉన్నా ఆ బస్సు ఏడాది కాలంగా అక్కడికి వెళ్లలేదు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) నిబంధనలకు విరుద్ధంగా బస్సు బాడీని నిర్మించడం, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వంటి అనేక లోపాలు 19 మంది ప్రాణాలను బలితీసుకున్నాయని ఆస్కీ నివేదిక తేల్చి చెప్పింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Kurnool Road Accident:కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
Pawan Kalyan undergoes surgery: పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
Improvement For Inter 2nd Year: ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే ఛాన్స్.. ఫీజు కట్టేయండి
ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే ఛాన్స్.. ఫీజు కట్టేయండి
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
IPL 2026 SRH VS CSK Result Update: హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా
హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు చెప్పులు లేదా బూట్లు కొనొచ్చా?
అక్షయ తృతీయ రోజు చెప్పులు లేదా బూట్లు కొనొచ్చా?
Embed widget