Karnataka Minister Priyanka Kharge tweets derogatory tweets against AP: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఏపీని కించపరిచినట్లుగా ప్రియాంక ఖర్గే ట్వీట్ పెట్టడం వివాదాస్పమయింది. భారతదేశంలో అతి పిన్ని రాష్ట్రంగా, మేము పెరుగుదలకు, ఉద్యోగాల సృష్టికి ప్రతి అవకాశాన్ని వెతుకుతున్నాం. రాష్ట్రాలు పెట్టుబడులు, ఉద్యోగాల కోసం పోటీపడితే, భారత్ సమృద్ధి చెందుతుందని నా నిజమైన నమ్మకం. అహంకారం సరి కాదన్నారు..
లోకేష్ ఇలా స్పందించడానికి కారణం కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (@PriyankKharge) ఏపీని కించపరుస్తూ ఓ ట్వీట్ పెట్టారు. బెంగళూరు ఆర్థిక ప్రగతి GDP 8.5% వృద్ధి, ఆస్తి మార్కెట్ 5% పెరుగుదల ఉందని.. ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతిన్న ప్రాణులు బలమైనవాటి మీద ఆధారపడి బతుకుతాయని.. "పారాసైట్" అని వ్యాఖ్యానించారు.
మాధ్యూఫిలిప్ అనేవ్యక్తి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నార్త్ సైడ్ ఎక్కువ ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని అన్నారు. దీనికి లోకేష్ స్పందించారు. బెంగళూరు నార్త్ సైడ్ కు సమీపంలోనే అనంతపురం ఉంటుందని .. పెట్టుబడులకు ఆహ్వానించారు. ఇదే ప్రియాంక్ ఖర్గేకు కోపం తెప్పించింది.
గతంలో బ్లాక్ బక్ సీఈవో రోడ్లపై గుంతలు ఉన్నాయని రోజులో గంటల తరబడి సమయం వృధా అవుతోందని ట్వీట్ పెట్టారు. అప్పుడు కూడా నారా లోకేష్ ఆ స్టార్టప్ సీఈవోను బెంగళూరుకు ఆహ్వానించారు. స్టార్టప్ యజమానులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం శివకుమార్ మండిపడ్డారు. అయితే ప్రజల ఫిర్యాదులను బ్లాక్ మెయిల్గా చూడకూడదని.. సమస్యలుగా భావించి పరిష్కరించాలని లోకేష్ కౌంటర్ ఇచ్చారు.