Jogi Ramesh support for Addepalli brothers fake liquor:  ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ పాత్రను నిర్దారిస్తూ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.  అన్నమయ్య జిల్లా ములకలచెరువు, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ అండతోనే అద్దేపల్లి సోదరులు నకిలీ మద్యం వ్యాపారాన్ని నడిపారని  తెలిపారు. జోగి రమేష్  మంత్రి పదవి కాలంలోనే ఈ దందా మొదలైందని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. సహకారానికి ప్రతిఫలంగా లంచాలు ముట్టజెప్పినట్లు పేర్కొన్న చార్జ్ షీట్‌ లో పేర్కొన్నారు.   ఈ ప్రాథమిక అభియోగపత్రంలో 8 మంది నిందితుల్ని చేర్చారు 

Continues below advertisement

ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేసిన 540 పేజీల చార్జ్ షీట్‌లో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము ఇద్దరూ  అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహన్‌రావులతో దీర్ఘకాలిక ఆర్థిక, వ్యాపార బంధాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలిపారు.  2006-2019 మధ్య స్వర్ణ బార్‌లో భాగస్వాములుగా ఉండి, 2013లో బాలాజీ బార్ కొనుగోలు చేసి 2019లో చెర్రీస్ బార్‌గా మార్చారని, తర్వాత ఏఎన్‌ఆర్ రెస్టారెంట్ అండ్ బార్‌గా మార్చారని ఆధారాలు చూపించారు.  జోగి రమేష్ మంత్రిగా ఉన్న 2022 జూన్‌లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేశారు. ములకలచెరువులో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసాలు, స్పిరిట్, మూతలు, లేబుల్స్ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. లేబుల్స్ డిజైన్‌లో N.రవి (A-4), తిరుమలశెట్టి శ్రీనివాసరావు (A-13) కీలక పాత్ర పోషించారు. సీసాల సరఫరా శ్రీనివాసరెడ్డి (A-11), బాట్లింగ్‌లో బాదల్ దాస్ (A-7), ప్రదీప్‌దాస్ (A-8) చచేశారు. విజయవాడలో శ్రీనివాస వైన్స్‌లో కల్యాణ్ (A-12) అమ్మకాలు చేశాడు.

సహకారానికి ప్రతిఫలంగా 2-3 నెలలకు ఒకసారి రూ.3-5 లక్షలు లంచాలు ముట్టజెప్పారు. 2022 జూన్‌లో జనార్దనరావు బ్యాంకు నుంచి రూ.8 లక్షలు, మరోసారి రూ.9 లక్షలు డ్రా చేసి, అందులో రూ.4-5 లక్షలు జోగి రాముకు అందజేశారు. 2021-2025 మధ్య అద్దేపల్లి సోదరుల ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్‌డ్రా చేసి, లంచాలకు ఉపయోగించారు. జనార్దనరావు, జోగి రాము మధ్య తరచు ఫోన్ కాల్స్, యూపీఐ లావాదేవీలు ఆధారాలు చార్జిషీట్‌కు జతచేశారు.  ప్రధాన నిందితుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు కస్టడీలో జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశాను అని అంగీకరించాడు. సెప్టెంబర్ 23న ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి వెళ్లి చర్చించినట్లు వెల్లడించాడు. జోగి ఇంటి సీసీ కెమెరా డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దుష్ప్రచారం చేసేందకు  యత్నాలు జరిగాయని ఊరూరా నకిలీ మద్యం తయారవుతోంది అనే ప్రచారం చేశారని పోలీసులు పేర్కొన్నారు. చార్జ్ షీట్‌లో ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రస్తుతం  జోగి రమేష్ సోదరులు జైల్లో ఉన్నారు.                             

Continues below advertisement