IPS PSR Anjaneyulu | అమరావతి: ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. నటి జత్వానీపై వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సిఐడి  అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అరెస్టు చేసి ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు సేవలు అందించారు. మాజీ సీఎం  జగన్ కు అత్యంత విధేయుడుగా పని చేశారని పి.ఎస్.ఆర్ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి.

ఏపీలో సీనియర్ ఐపీఎస్‌లుగా ఉన్న విశాల్ గున్ని, పీఎస్ఆర్ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటాల సస్పెన్షన్  మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ కూటమి ప్రభుత్వం మారినప్పటి నుంచి విదుల్లో లేరు. మొదట చంద్రబాబు ప్రభుత్వం వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు.          

ముగ్గురు ఐపీఎస్‌లకు మరింత గడ్డు కాలం 

ముంబై నటి జత్వానీ కుటుంబాన్ని మహారాష్ట్ర నుంచి ఏపీకి తీసుకు వచ్చి చిత్ర హింసలు పెట్టారని ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా సినీ నటుల్ని, ప్రముఖుల్ని అరెస్ట్ చేస్తే పోలీసులు మీడియాకు వివరాలు ఇచ్చేవారుు. మీడియా ముందు ప్రవేశ పెట్టేవాళ్లు . కానీ అసలు ఈ వ్యవహారం వైసీపీ హయాంలోనే బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితురాలు కాదంబరి జెత్వానీ బయటకు వచ్చి కేసులు పెట్టారు. అది కూడా మీడియాకు లీకులు అంది ఆమెపై వేధింపులు జరిగాయని వార్తలు వచ్చాక ఫిర్యాదు చేశారు. కాదంబరి జెత్వానీ తన స్థలాన్ని అక్రమంగా అమ్మాలని ప్రయత్నించి రూ.5 లక్షలు తీసుకుందని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేయడానికి ముందే పోలీసులు ముంబై వెళ్లేందుకు టిక్కెట్లు సైతం బుక్ చేసుకున్నారు  ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. తరువాత ఆయన బెయిల్ తెచ్చుకున్నారు.  పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ లభించింది.  

సినీ నటి జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని అభియోగాలు          

ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేయడానికి ప్రధాన కారణం వైసీపీ హయాంలో నటి కాదంబరి జత్వానీపై వేధింపులు. ముంబయి నటితో పాటు ఆమె కుటుంబాన్ని బలవంతంగా ఏపీకి తీసుకొచ్చి వేధించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మారాక కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేయడంతో ఆమెపై జరిగిన వేధింపుులు, తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని వెలుగు చూసింది. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీ నేత విద్యాసాగర్‌, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలే ఇందుకు కారణమని జత్వానీ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ లపై ఆరోపణలు రావడంతో అప్పటి  డీజీపీ ద్వారకా తిరుమలరావు పూర్తిస్థాయి విచారణకు సైతం ఆదేశించారు.          

కూటమి ప్రభుత్వం వచ్చిన  విచారణ                   

 డీజీపీ ఆదేశాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో జత్వానీ, ఆమె ఫ్యామిలీపై గతంలో నమోదైన కేసు దర్యాప్తు చేపట్టి.. డీజీపీకి నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌ల అధికారులపై ప్రభుత్వం వేటు పడింది. ఇదే కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ సైతం గతంలో సస్పెండ్ చేశారు.