India and America joint exercise at Kakinada: కాకినాడ: భారత, అమెరికా నావికాదళ సిబ్బంది, అధికారులు కాకినాడ సముద్ర జలాల్లో సంయుక్తంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇరు దేశాల యుద్ధ సన్నద్ధతను తెలిపేలా నిర్వహించిన ఈ విన్యాసాలు శనివారం (మార్చి 30న) ముగిశాయి. కాకినాడ సముద్ర తీరంలో గత నాలుగు రోజులపాటు ‘టైగర్‌ ట్రయంఫ్‌-24’ సీ ఫేజ్‌ విన్యాసాలు శనివారం నాడు ముగిశాయి. 

(Photo: Twitter/@IN_HQENC)

మార్చి 27 నుంచి 30 వరకు సైనిక విన్యాసాలు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌లో భారత్‌- అమెరికా యాంపీబీఎస్‌ విన్యాసాల్లో భాగంగా 2 దేశాలకు చెందిన సుమారు 1100 మంది త్రివిధ దళాల సైనికులు, అధికారులు మార్చి 27 నుంచి 30 వరకు సైనిక విన్యాసాలు నిర్వహించారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా నేవీ అధికారులు, సిబ్బంది ఈ విన్యాసాలో పాల్గొన్నారు. నేవీ రియల్‌ అడ్మిరల్‌ ప్లాగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ ధనకర్‌, ఆర్మీ మేజర్‌ జనరల్‌ అఖిలేష్‌కుమార్‌, అమెరికా నేవీ రియర్‌ అడ్మిరల్‌ వైస్‌ కమాండర్‌ జాక్విన్‌ మార్టినైజ్‌ త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాలను తిలకించారు.  

త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో టైగర్‌ ట్రయంఫ్‌-24 ఇండియా-అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన టైగర్‌ ట్రయంఫ్‌-24 యాంపిబీఎస్‌ విన్యాసాలు ముగిశాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతోపాటు ఇండియాకు చెందిన ఐఎన్‌ఎస్‌ జలస్వ, కేసరి, ఐరావత్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యుద్ధ సమయంలో శత్రుదేశాలపై చేసే వీరోచిత పోరాట ప్రదర్శన, విపత్తులు, ఆపద సమయంలో రెస్క్యూ టీమ్ అందించే విలువైన సేవలను ప్రదర్శించారు. కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలలో భారత్ నుంచి 700 మంది, అమెరికా నుంచి 400 మంది సభ్యులు విన్యాసాల్లో పాల్గొన్నారు. 

(Photo: Twitter/@IN_HQENC)

తుపాన్లు, విపత్తుల సమయంలో అందించే సేవలను ఈ విన్యాసా ల్లో ప్రదర్శించారు. ఐఎన్‌ఎస్‌ జలస్వ, ఐరావత్‌, కేసరి యుద్ధనౌకల్లో నుంచి సిబ్బంది, హెలికాఫ్టర్లు, మెకనైజ్డ్‌ లాంగ్‌ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌లు, ల్యాండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ డాక్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ల్యాండింగ్‌ షిప్‌ ట్యాంకు లు, శాన్స్‌ ఎయిర్‌క్రాప్ట్‌, మెకనైజ్డ్‌ ఫోర్సెస్‌తో భారీ వెసల్స్‌, జెమినీ బోట్లు, జెట్‌లు, యుద్ధ ట్యాంకర్లు, బంకర్లలలో ఆర్మీ సిబ్బంది వెపన్లతో భూఉపరితలం, జల, ఆకాశమార్గాల ద్వారా నిర్వహించిన విన్యాసాలు అద్భుతం అని చెప్పవచ్చు. అమెరికా నుంచి ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ ఎయిర్‌ కుషన్‌లు, హెలికాఫ్టర్లతో కూడిన ల్యాండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ డాక్‌, డిస్ట్రాయర్‌ ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.

మార్చి 18 నుంచి 24 వరకు వైజాగ్ హార్బర్ బేస్డ్ విన్యాసాలు జరిగాయి. కాకినాడ సముద్ర విన్యాసాలకు అనువైన ప్రాంతం కావడంతో తాజాగా మార్చి 27 నుంచి 30 వరకు సముద్రం యాక్టివిటీస్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.