AP Heavy rains: తమిళనాడు పై ఏర్పడిన అల్లపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఆరు జిల్లాల్లో 204.5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. 25 వ తేదీ వరకు మొత్తం కోస్తా, తూర్పు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది.
SPSR నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. బుధవారం ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు మంచి వర్షాలు కురిసినట్లు రియల్‌టైమ్ డేటా తెలిపింది. బాపట్ల, కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉదయం , రాత్రి సమయాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం , శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీతెలిపింది గట్టి గాలులు, మెరుపులు , ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది.
అనంతపురం, శ్రీ సత్యసాయి, కుర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.. సాయంత్రం సమయాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. నిపుణులు ప్రకటించారు. వర్షాలు మధ్యస్థంగా ఉన్నప్పటికీ, 30-40 కి.మీ./గం గాలులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతాల్లో రెండు అల్ప పీడనాలు ఏర్పడ్డాయి. తమిళనాడు పై లోప్రెషర్ వ్యవస్థ తూర్పు దిశలో కదులుతూ, పుడుచ్చేరి, సౌత్ కోస్టల్ ఏపీ తీరాలకు ప్రభావం చూపుతోంది. ఈ వ్యవస్థల ప్రభావంతో తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. IMD ప్రకారం, అక్టోబర్ 26 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయి.
IMD ట్రాపికల్ వెదర్ అవుట్‌లుక్ ప్రకారం, అక్టోబర్ 24-25 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరాలు ప్రభావితం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) హై అలర్ట్ ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు రిలీఫ్ క్యాంపులు, ఎవాక్యుయేషన్ ప్లాన్లు సిద్ధం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని IMD హెచ్చరించింది.