హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కు ( MLA Bala krishna  ) పీఏ గా వ్యవహరిస్తున్న బాలాజీ  డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాలాజీ 
ఇటీవల కర్ణాటక సరిహద్దులోని బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వైఎస్ఆర్‌సీపీ ( YSRCP )  స్థానిక నేతలతో కలిసి ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లి ్మరీ పేకాట ఆడుతున్నారు. అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయనపై విచారణ జరిపిన ప్రభుత్వం తప్పు చేసినట్లుగా నిర్ధారించింది. ఎమ్మెల్యేకు ( MLA PA ) పీఏగా డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది.

  


బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి. బాలకృష్ణ ఆయనను పీఏగా నియమించుకున్నారు. దానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  బాలాజీ ( Balaji ) వయోజనవిద్య సూపర్ వైజర్ గా కొనసాగుతున్న సమయంలో బాలకృష్ణ పీఏ పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఆయన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయులకు ఇతర విధులు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉన్నాయి. బాలకృష్ణ పీఏగా వెళ్లడానికి కుదరదు. అందుకే ఆయన తన పోస్టింగ్‌ను  వయోజన విద్యలో సూపర్ వైజర్ గా మార్పించుకుని .. ఆ తర్వాత బాలకృష్ణ వద్ద పీఏగా చేరాడు. చాలా రోజుల నుంచి బాలకృష్ణ పీఏగా నియోజకవర్గంలో వ్యవహారాలు చక్క బెడుతున్నారు. 


బాలకృష్ణ స్థానికంగా ఇల్లు తీసుకున్నప్పటికీ ఎక్కువగా ఉండరు. ఎమ్మెల్యే తరపున వ్యవహారాలన్నీ బాలాజీనే చక్క బెడుతూ ఉంటారు. దీంతో ఆయన ఎమ్మె.ల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలతో కలిసి పొరుగు రాష్ట్రంలో పేకాడుతూ దొరికిపోవడం కలకలం రేపింది. అయితే ఆయన అలా దొరికిపోయినప్పటికీ బాలకృష్ణ స్పందించలేదు. ఆ తర్వాత బాలాజీ యధావిధిగా పీఏగా పనులు చక్క బెడుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను అక్కడ కొనసాగించడానికి సిద్ధంగా లేదు. దీంతో డిప్యూటేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇక నుంచి ఆయన ఎమ్మెల్యే పీఏ గా  కొనసాగేందుకు వీలు ఉండదు. టీచర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ పీఏల వ్యవహారాశైలి వివాదాస్పదమయింది. అప్పట్లో దుమారం రేగడంతో ఆయనను తొలగించి బాలాజీని పెట్టుకున్నారు. ఆయన తీరు కూడా వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఏపీగా ప్రభుత్వం ఎవరిని కేటాయిస్తుందో కానీ బాలకృష్ణ పీఏ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదన్న వాదన వినిపిస్తోంది.