LPG e-KYC: రాయితీపై వంట గ్యాస్ పొందే కస్టమర్లు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్పీజీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ లేదా e-KYC పూర్తి చేయని వారికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేయలేదో, వారికి తక్షణమే గ్యాస్ బుకింగ్స్ బ్లాక్ అవుతాయి. అక్టోబరు 1 నుంచి ఈ-కేవైసీ చేసిన వారికే రాయితీపై వంటగ్యాస్‌ సిలిండర్‌ అందుతుంది. లేకుంటే రాయితీ సిలిండర్‌ ఇవ్వరు. 

Continues below advertisement

ఈ-కేవైసీ గడువు  

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కోట్లాది మంది వంట గ్యాస్ కస్టమర్లు ఇంకా ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ అందేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. సెప్టెంబర్ 14 నాటికి ముగిసిన ఈ-కేవైసీ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయనివారికి సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. 

ఎల్పీజీ గ్యాస్ సేవలు  

  • ఈ-కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు గ్యాస్ కంపెనీలు కొత్త గ్యాస్ సిలిండర్ రీఫిల్స్‌ను బ్లాక్ చేస్తున్నాయి.
  • నాన్-బీఏఏ  కస్టమర్లకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్,  టార్గెటెడ్ సబ్సిడీలు నిలిచిపోతాయి.
  • ఒకసారి కస్టమర్లు ఆన్‌లైన్ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా e-KYC పూర్తి చేయగానే, వారి కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ ధరతో పాటు వర్తించే సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి పొందవచ్చు. Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్స్!

ఆన్‌లైన్‌లో ఎల్పీజీ e-KYC పూర్తి 

ఇండేన్ గ్యాస్ e-KYC కోసం 

భారత్ గ్యాస్ e-KYC కోసం

  • Hello BPCL App డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • హోమ్‌పేజీలో కనిపించే e-KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే 6-అంకెల OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
  • నిబంధనలను అంగీకరించి, ప్రాసెస్ పూర్తి చేయండి.

 హెచ్‌పీ గ్యాస్‌ కస్టమర్లు హెచ్‌పీ పే యాప్‌ ద్వారా కేవైసీ పూర్తిచేసుకోవచ్చు.

Continues below advertisement

మీరు ఇప్పటికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ బయోమెట్రిక్ ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, వెంటనే సంబంధిత గ్యాస్ ప్రొవైడర్ యాప్ ద్వారా పూర్తి చేసుకోండి. లేదంటే గ్యాస్ సిలిండర్ రీఫిల్స్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.  

 Also Read: యూపీఐ కొత్త రూల్స్.. రూ.2 వేలు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్.. చిరు వ్యాపారులు, సాధారణ కస్టమర్లకు పూర్తిగా ఫ్రీ