పెగాసస్ స్పైవేర్ పేరుతో  తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. నిజంగా వాడి ఉంటే ప్రభుత్వమే ప్రకటన చేయాలని మాజీ ఇంటలిజెన్స్  చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏీబ వెంకటేశ్వరరావు సూచించారు. తనపై నాలుగు రోజులుగా అసత్య ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చేందుకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 


2019 మే వరకూ ఏపీ ప్రభుత్వం పెగాసస్ కొనలేదు..వాడలేదు !


సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే పెగాసస్‌ను కొనలేదని డీజీపీ ఆఫీస్‌ లేదు అని చెప్పిందని అయినా ఆరోపణలు చేస్తున్నారని..  పెగాసస్‌పై అనుమానాలు నివృత్తి చేయడం తన బాధ్య అని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న  ఆరోపణలు అన్నీ కూడా నేను ఇంటలిజెన్స్‌ విభాగానికి అధిపతిగా ఉన్న కాలానికి సంబంధించినవి... 2015 నుంచి  2019 మార్చి ఆఖరి వరకు నిఘా విభాగాధిపతిగా ఉన్నాను. ఆ తర్వాత రెండు నెలల వరకు కూడా ఏం జరుగుతోందని ఏంటీ అన్నది నాకు సమాచారం ఉంది. ఏపీ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా పని చేస్తున్న కాలంలో ఏ జరిగిందన్నది పూర్తి నాలెడ్జె్‌తో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే... 2019 వరకు ప్రభుత్వం గానీ, డీజీపీ ఆఫీస్‌గా, సీఐడీ విభాగం గానీ, ఏ ఇతర విభాగం గానీ, ఏ ప్రైవేటు ఆఫీస్‌ గానీ పెగాసస్‌ కొనలేదు వాడలేదు. ఆ కాలం గురించి మీ సెల్‌ఫోన్ హ్యాక్  అయ్యాయేమో అనే భయోందళనలు మాని నిశ్చింతంగా ఉఁడండి.  సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా పూర్త సమాచారం ఆయా విభాగాలు ఇస్తాయి. ప్రభుత్వమే ఒక స్టేట్‌మెంట్ ఇస్తే మంచిది. ఈ రాచమార్గాలు వదిలి పెట్టి లేనిపోని ఆరోపణలు అసత్యాలు అసంబద్దమైనటువంటి వాదనలతో ప్రజలను కన్ఫ్యూజన్‌లో పడేయడం ఎందుకని ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  


తప్పుడు ఆరోపణలపై పరువు నష్టం దావాకు పర్మిషన్ కోసం వినతి పత్రం !


 నాలుగు రోజులుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులకు అసత్య, అన్యాయమైన ఆరోపణలు చేసిన కొందరిపై పరువు నష్టం దావా వేయడానికి సీఎస్‌కు రిక్వస్ట్‌ పెట్టుకున్నానని ఏబీ వెంకటేశ్వరరావుతెలిపారు.  నాపై అసత్య ఆరోపణలు చేస్తూ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అబ్బయ్య చౌదరి పయినీర్‌, స్వర్ణాంధ్ర, గ్రేట్‌ ఆంధ్ర.కామ్‌.పై పరువునష్టం దావా వేయడానికి అనుమతి కోరాన్నారు.  వీటన్నింటికీ సంబంధించి ఆధారాలను మీడియాకు ఇచ్చారు. తనను సస్పెండ్ చేసిన నాటి నుంచి 
ఈ అధికారికమైన ఛానల్‌ను పక్కన పెట్టి అబద్దాలను ప్రచారంలోకి తీసుకురావడం బురదజల్లడమే కార్యక్రమంగా పెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని ఏబీవీ ప్రశ్నించారు.   


పాత  ఆరోపణల విచారణలు ఇంకా తేల్చలేదు ! 


ఇప్పటి వరకూ తనపై చేసిన విచారణల్లో ఏమీ తేల్చలేదన్నారు.  రోడ్డుపై మాట్లాడితే తప్పుబడుతూ ఎంక్వయిరీ చేస్తున్నారు. దాన్ని  త్వరగా ముగించి దానికి అంతిమ నిర్ణయం తీసుకోమని కోరుతున్నాను. నాపై ఇంతకు ముందు జరిగిన విచారణ అంశాలు పెండింగ్‌లో ఉండటానికి నేను కారణం కాదు. దానిపై కేంద్రానికి రాశారుయ. అక్కడ పెండింగ్‌లో ఉంది. నా సస్పెన్షన్‌ చట్టవిరుద్దమని హైకోర్టు చెబితే దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అది కూడా పెండింగ్‌లో ఉంది. నాపై విచారణకు ఎలాంటి వెనుకంజ వేయలేదన్నారు.,  తొందరగా చెప్పాలని ఎప్పటికప్పుడు కోరుతున్నాను. ఇవాళ కూడా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశానన్నారు. తన  సస్పెన్షన్ ఆర్డర్‌తోపాటు సీపీఆర్వో  ఆరు పేజిల అబద్దాలను మీడియా మొత్తానిక పంచిపెట్టారు. అర్థరాత్రి ఇస్తే చూసుకోరని అర్థరాత్రి పంచిపెట్టారు. జరిగింది ఫిబ్రవరిలో జరిగితే... 2020 డిసెంబర్‌లో ఛార్జ్‌షీట్ ఇచ్చారు.  రెండింటికీ సంబంధం లేదన్నారు.  ఛార్జ్‌షీట్‌ వచ్చే వరకు చెప్పే అవకాశం కూడా నాకు కలగలేదు. ఛార్జ్‌షీట్‌లో చెప్పిన మూడు అభియోగాల్లో మూడింటిలో ఒకటి తప్పని విచారణ అధికారే చెప్పారని గుర్తు చేసారు.  డీజీపీ రాసిచ్చిన తర్వాత కూడా మళ్లీ వేరుగా స్పందించాల్సిన అవసరం ఏముందని ఏబీవీ ప్రశ్నించారు.  ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే ప్రభుత్వాన్ని డీజీపీ ఆఫీస్‌ను, హోం డిపార్ట్‌మెంట్‌ను అడగాలన్నారు.  వైవీ సుబ్బారెడ్డి దిల్లీ హైకోర్టులో కేసు వేశారు. సజ్జల రామకృష్ణా మరో కేసు వేశారు. మాకు నోటీసులు ఇచ్చారు. సమాధానం కూడా ఇచ్చాం. 2019 మార్చి వరకు నాది బాధ్యత. ప్రభుత్వం మారిన ఆరు నెలల సమయం తర్వాత వైవీ సుబ్బారెడ్డి దిల్లీ కోర్టులో కేసు వితడ్రా చేసుకున్నారు. సజ్జల వేసిన కేసులో ఎవరూ అటెండ్‌ కావడంలేదని దాన్ని డిస్మిస్ చేశారని గుర్తు చేశారు.  ప్రతి ఆరునెలలకు సీఎస్‌ వద్ద సమీక్ష ఉంటుంది. ఉన్నతాధికారుల కమిటీ కూడా ఉంటుంది. వివరణగా అన్ని విషయాలు చూసి సంతృప్తి వ్యక్తం చేస్తే మా పని ముందుకు సాగుతుందన్నారు. 



పచ్చి అబద్దాల ప్రచారంతో వ్యక్తిత్వ హననం ! 


౩7 మంది డీఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే ఎక్కువ మందికి ఒకే కులానికి ఇచ్చారని ఓ వ్యక్తి కాగితాలను ఊపుతూ చెప్పింది పచ్చి అబద్దమా కాదా అని ఏబీవీ ప్రశ్నించారు. ప్రస్తుతం  పెగాసస్ అంశంలోనూ  అంతే పచ్చి అబద్దమన్నారు. తనకు ఇంకా రెండేళ్లు సర్వేసు ఉందని ఈ  రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దామన్నారు. తాను తెలుగు గడ్డపై పుట్టానని అక్కడి స్కూళ్లలోనే చదువుకున్నాని చీమునెత్తురూ ఉందని ఏబీవీ తెలిపారు.