Kodali Nani Health Newa | ఏపీ మాజీ మంత్రి, YSRCP నేత కొడాలి నాని అస్వస్థత కు గురయ్యారు. ఆయనకు చాతిలో ఇబ్బంది అనిపించడంతో గచ్చిబౌలిలోని విఐజి ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా ఆయన గుండెలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్టిక్ సమస్య ఉందని ఆస్పత్రిలో చేరితే పరీక్షల అనంతరం అది గుండె సంబంధిత సమస్యగా డాక్టర్లు తేల్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని సమాచారం.
గత ఏడాది ఏపీలో పోలింగ్ సమయంలో అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరిగింది. ఆయన అనారోగ్యం కారణంగా ఎవరినీ కలవడం లేదని, అందుకే పార్టీ నేతలతో సమావేశం కావడం లేదని ప్రచారం జరగడం తెలిసిందే. అయితే నందివాడ మండలంలోని తన ఇంట్లో వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. ఆ వదంతులకు కొడాలి నాని ఒక్క ట్విట్టర్ పోస్టుతో చెక్ పెట్టారు. సోఫాలో తాపీగా కూర్చుని వైసీపీ నేతలతో చర్చల్లో భాగంగా తీసిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కొడాలి నానికి అనారోగ్యం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.