Andhra News :  ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ప్రశ్నించారు.   ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22 శాతం పెరిగింది. టీడీపీ హాయంలో రూ,2,71,797 కోట్ల అప్పులు చేశారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు?. చంద్రబాబు హయాంలో రెవెన్యూ ఆరు శాతం కాగా, వైఎ‍స్సార్‌సీపీ ప్రభుత్వంలో 16.7 శాతం రెవెన్యూ రాబడి వచ్చిందని తెలిపారు. 


ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపీఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందని బుగ్గన తెలిపారు.   కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బంది అయ్యిందన్నది వాస్తవం అన్నారు బుగ్గన.. కానీ, పెండింగ్ బిల్స్ 1,90 వేల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? అని ప్రశ్నించారు. ఆర్బీఐ విడుదల చేసిన డాక్యుమెంట్ లో 15 ఏళ్ల డేటా ఉంటుంది.. టీడీపీ హయాంలో వార్షిక అప్పు 22 శాతం ఉంటే.. మా ప్రభుత్వంలో 12 శాతమే అన్నారు. ఆర్బీఐ, ఆర్ధిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయటం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. 


స్థూల ఉత్పత్తిపై టీడీపీ హయాంలో అప్పు 2,59,000 కోట్లు.. అంటే 7 శాతం నిష్పత్తి.. మా ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తిలో 2,26,000 కోట్ల అప్పు.. నిష్పత్తిలో 5.6 శాతమే అన్నారు. మా ప్రభుత్వ హయాంలో స్థూల ఉత్పత్తి 10,84,000 కోట్లు.. టీడీపీ హయాంలో స్థూల ఉత్పత్తి 6,98,000 కోట్లు.. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు 2018-19లో రూ.44,86,000.. 2022-23లో పీఎఫ్ ఖాతాలు రూ.60,78,000.. మరి ఉద్యోగాలు పెరిగినట్లా కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారని.. ఆయన వయసుకు ఇలా పేర్లు పెట్టడం పద్ధతిగా ఉంటుందా? అని ప్రశ్నించారు.  మా ఎమ్మెల్యేలు చంద్రబాబు కు పేర్లు పెట్టలేరా? అని ప్రశ్నించారు. మాకు సంస్కారం ఉంది కనుకే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. 


రాష్ట్రంలో వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.  రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని ఫైర్‌ అయ్యారు. 2008లో తెలంగాణ ఏర్పాటుకు లేఖ రాశాడు చంద్రబాబు.. ఏపీకి స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ పోవటానికి చంద్రబాబు కారణం కాదా? హోదా వద్దు ప్యాకేజీ చాలు అని ఎందుకు అన్నారు? అని నిలదీసిన ఆయన.. ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించుకోలేక పోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు జనాభా ప్రకారం, ఆస్తులు లొకేషన్ బట్టి విభజన చేస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు.  పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం నుండి మన వాటా నిధులు మేము సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారన్నారు.