News
News
X

East Godavari News : శివలింగానికి టెంట్ తాళ్లు, పాలక ఇదేమీ చోద్యమయ్యా?

East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమం కోసం వేసిన టెంట్ల తాళ్లను నిర్వాహకులు పక్కనున్న ఆలయంలోని శివలింగానికి కట్టారు. ఈ ఘటన వివాదాస్పదం అయింది.

FOLLOW US: 
 
East Godavari News : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం వేసిన టెంట్ల తాళ్లను నిర్వాహకులు శివలింగానికి కట్టడం వివాదాస్పదం అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భక్తులు నిర్వాహకులు తీరుపై మండిపడుతున్నారు.  

అసలేం జరిగింది? 

అనపర్తి మండలం బిక్కవోలు గ్రామంలో మూడో విడత చేయూత పథకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులు హాజరు అయ్యారు. భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసిన స్థానిక నాయకులు టెంట్ తాళ్లను తూర్పు చాణుక్యల కాలానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని శివలింగానికి కట్టడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారు. ఆ వీడియో వైరల్ గా మారడంతో స్థానికులు, గ్రామస్తులు వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ఘటనపై అనపర్తి నియోజకవర్గం వైసీపీ నాయకులు, బహిరంగ సభ ఏర్పాటు చేసిన నాయకులు, కనీసం స్పందించలేదని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపూరతనమైన ఆలయంలో శివలింగానికి టెంట్ తాళ్లు కట్టడంపై మండిపడుతున్నారు. 

వైసీపీ ఓ పేర్ల పిచ్చి పార్టీ, దోచుకున్నది చాలు దోపిడీ ఆపండి: సత్యకుమార్

News Reels

మండిపడుతున్న భక్తులు 

ప్రసిద్ధ ఆలయంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే తప్పని, పైగా భక్తుల మనోభావాలను కించ పరిచే విధంగా శివలింగానికి టెంట్ తాళ్లు కట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన సభ బ్రహ్మాండంగా నిర్వహించారు కానీ సభ పేరుతో  శివలింగానికి షామియానా తాళ్లు కట్టడం సరికాదన్నారు. సభ పేరుతో శివలింగానికి అపచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షామియానా తాళ్లు కట్టడానికి సమీపంలోని కర్రలు ఏవైనా ఉపయోగించాలి గానీ ఇలా శివలింగానికి తాళ్లు కట్టడమేంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ గోలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయని భక్తులు అంటున్నారు.  ఒకటి దక్షిణ దేశంలోని ఫలణిలో అయితే రెండోది బిరుదాంకపురంలో ఉంది.  మరి బిక్కవోలు ఆలయంలో జరిగిన అపచారానికి అధికారులు ఏవిధంగా స్పందిస్తారో  వేచిచూడాలి. 

Also Read : Ysrcp Internal Politics : నంద్యాల వైసీపీలో వర్గ విభేదాలు, సీఎం వద్దే పంచాయితీ తేల్చుకుందామని సవాల్!

Also Read : Botsa Satyanarayana: 3 రాజధానులు చేస్తే తప్పేంటి? అదే జరిగితే నేను మంత్రిగా అనర్హుడ్ని - బొత్స

Published at : 25 Sep 2022 04:22 PM (IST) Tags: East Godavari news Viral video YSRCP Leaders Bikkavolu Tent ropes Shivalinga

సంబంధిత కథనాలు

ఢిల్లీకి సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు- ప్రధానమంత్రి నిర్వహించే సమావేశంలో పాల్గోనున్న ఇరువురు నేతలు

ఢిల్లీకి సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు- ప్రధానమంత్రి నిర్వహించే సమావేశంలో పాల్గోనున్న ఇరువురు నేతలు

Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షావరణం

Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షావరణం

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ గర్జన - కర్నూలులో భారీ ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ గర్జన - కర్నూలులో భారీ ర్యాలీ

Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం

Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

టాప్ స్టోరీస్

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్

Paayal Rajput: పాయల్ రాజ్ పుత్ ఫన్నీ ఫోజులు

Paayal Rajput: పాయల్ రాజ్ పుత్ ఫన్నీ ఫోజులు