Donor Raj Mantena donates Rs 9 crore to TTD:  తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు  మెరుగుపరిచేందుకు   తిరుమల తిరుపతి దేవస్థానం కి మరో గొప్ప విరాళం అందింది. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు  వ్యాపారవేత్త, శ్రీవారి భక్తుడు  మంతెన రామలింగ రాజు మంగళవారం రూ.9 కోట్ల విరాళం అందజేశారు. ఈ మొత్తం తిరుమలలోని పీఏసీ 1, పీఏసీ 2, పీఏసీ 3  భవనాల పూర్తి అధునీకరణకు ఉపయోగించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు  మంతెన రామలింగ రాజు ఈ విరాళం డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. 

Continues below advertisement

ఇది  మంతెన రామలింగ రాజు మొదటి విరాళం కాదు. 2012లోనే ఆయన టీటీడీకి రూ.16 కోట్ల భారీ విరాళం అందజేశారు.  తిరుమలలోని  పద్మావతి రెస్ట్ హౌస్ నిర్మాణానికి విరాళమిచ్చారు.  ఆ సమయంలోనూ భక్తుల సౌకర్యార్థమే ఈ విరాళం అందించినట్లు ఆయన తెలిపారు. పీఏసీ 1, 2 & 3 భవనాలు తిరుమలలో భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉండే ప్రధాన వసతి గృహాలు.  ఈ భవనాలను ఆధునిక సౌకర్యాలతో – ఎయిర్ కండిషనింగ్, మెరుగైన బెడ్డింగ్, వై-ఫై, శుభ్రమైన టాయిలెట్స్, 24 గంటల భద్రత – కల్పించి పూర్తి రూపురేఖలు మార్చనున్నారు. ఈ పనులు 2026 చివరి నాటికి పూర్తవుతాయని టీటీడీ అంచనా వేస్తోంది.

 రాజ్ మంతెన కుమార్తె పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. కుమార్తె, అల్లుడితో కలిసి శ్రీవారి దర్శనానికి కుటుంబంతో సహా రాజ్ మంతెన వచ్చారు.  తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త రాజ్ మంతెన. ఫార్మా, ఐటీ రంగాల్లో భారీ కంపెనీలు నడిపి, వాటిని విక్రయించి బిలియనీర్ స్థాయికి చేరిన ఆయన, ఇటీవల తన కుమార్తె నేత్ర మంతె  వివాహాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిపించారు. ఈ పెళ్లికి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్, జాన్వీ కపూర్, రణ్వీర్ సింగ్, కృతి సనన్ వంటి అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సంఘటనతో ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

Continues below advertisement

 రాజ్ మంతెన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కలవపూడి సమీపంలోని చిన్న గ్రామంలో జన్మించారు. తెలుగు కుటుంబంలో పెరిగిన ఆయన, యువకులంగా అమెరికాకు  వెళ్లి, ఫార్మా ,  ఐటీ రంగాల్లో కెరీర్ ప్రారంభించారు. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో కంపెనీలు స్థాపించి, వాటిని విజయవంతంగా నడిపారు. ముఖ్యంగా, ఫార్మా కంపెనీలు, ఐటీ సర్వీసెస్‌లో భారీ లాభాలు సంపాదించారు. గత 10-15 సంవత్సరాల్లో తన కంపెనీలను విక్రయించడం ద్వారా డాలర్లలో బిలియన్లు ఆర్జించినట్టు అంచనా.     మాజీ బీజేపీ ఎంపీ, మాజీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అల్లుడు. గంగరాజు కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నారు. రాజ్ మంతెన తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా దానం చేస్తారు .