Pawan BJP :  ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ప్రధాని మోదీకి తెలియదా.. మనం ప్రత్యేకంగా చెప్పాలా ?. సమాఖ్య స్ఫూర్తిలో భాగంగానే రాష్ట్ర అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని  జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవనిగడ్డ బహిరంగసభలో వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తులపై ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదు కానీ..  బీజేపీది కూడా నిస్సహాయతే అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో బీజేపీకి తెలిసినా.. ఏమీ  చేయలేకపోతున్నారని అంటున్నారు. పవన్ మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. 


చంద్రబాబు అరెస్ట్ తెర వెనుక బీజేపీ ఉందని విమర్శలు                  


ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీని  అనుమనించే వారు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు.  ఓ మాజీ  ముఖ్యమంత్రిని నోటీసు లేకుండా, ఎఫ్ఆఆర్‌లో పేరు లేకుండా  అరెస్ట్  చేయడం సాధ్యం కాదని ెచబుతున్నారు.  చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీ ప్రమేయం.. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని  వామపక్షాలతో పాటు ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని  బీజేపీ నేతలు కూడా ఖండించారు. కానీ వారి ఖండనలు కూడా కృతకంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై బీజేపీ, వైసీపీ కలిసే రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. 


వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి 160 సీట్లలో విజయం: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి


బీజేపీకి తెలిసినా సమాఖ్య స్ఫూర్తి కోసం బీజేపీ మాట్లాడటం లేదంటున్న పవన్          


ఏపీలో జరుగుతున్న   అన్ని అంశాలపై కేంద్రానికి సమాచారం ఉంటుంది. కానీ ప్రతి విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోలేదని పవన్ కల్యాణ్ అంటున్నారు.  రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ప్రజలు ఎన్నుకున్నారు. ఆయా ప్రభుత్వాల విధుల్లో కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఇదే  విషయాన్ని పవన్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ప్రధాని మోదీకి తెలుసని.. శాంతి భద్రతలు, సీఐడీ అన్నీ  రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయన్నారు. వీటిపై  కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉంటుంది కానీ.. తాము  చర్యలు తీసుకునే అధికారం తమ దగ్గరకు  వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. 


అరచేతిని అడ్డుపెట్టి చంద్రుడ్ని ఆపలేరు - త్వరలోనే గ్రహణం వీడుతుంది - మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు


బెంగాల్ లో తామే బాధితులమంటున్న బీజేపీ !                 


బీజేపీ నేతలు కూడా వైసీపీపై పోరాడుతున్నామని చాలా కాలంగా చెబుతున్నారు. ఏపీ కంటే ఘోరమైన రాజకీయ హింస  బెంగాల్ లో ఉంటుందని అక్కడ తాము  బాధితులమని బీజేపీ నేతలు గుర్తు చే్తున్నారు.  బెంగాల్ లో రాజకీయ హింస ఎక్కువగా ఉంటుంది. అయినా  అక్కడ బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తుంది. ప్రజా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకుకోలేదు.  ఇక్కడే  బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని ఎలా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చునని.. ఏపీలోనూ అంతే వ్యవహరిస్తోందని బీజేపీ నేతలంటున్నారు. వైసీపీకి సహకారం అనేది కరెక్ట్ కాదని చెబుతున్నారు. పవన్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.