CM Jagan Volunteers : ప్రభుత్వం గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరగడానికి .. వారికి ప్రభుత్వం చేస్తున్న మేళ్లు గురించి వివరించడానికి వాలంటీర్లు ముందు ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగన్ మాటలు వింటే ఆయన వైసీపీ క్యాడర్ కన్నా ఎక్కువగా వాలంటీర్లపై నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వంలోనూ వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వ పథకాలు నేరుగా ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారని.. 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లేనని సీఎం జగన్ అంటున్నారు.
వాలంటీర్లను లీడర్లను చేస్తానని జగన్ హామీ
5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారధులు వాలంటీర్లు అని.. ప్రతి గడపకూ నేరుగా వాలంటీర్లే మనకున్న బలం అని నేరుగా చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారని.. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్‌కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులని.. వాలంటీర్ కార్యక్రమం మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని జగన్ హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పట్లోనే తాను లీడర్లుగా చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఆ మాటను గుర్తు పెట్టుకోవాల నిసూచించారు.
ప్రభుత్వం చేసిన మంచినీ ప్రతీ ఇంటికి ప్రచారం చేయాలని పిలుపు
జగనన్న సైన్యం వాలంటీర్లని.. ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలని జగన్ కోరారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలన్నారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదేనని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ వాలంటీర్లే తమ ప్రభుత్వం గురించి ప్రజలకు చెబుతారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు . పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పెద్దగా పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు సీఎం జగన్ పై ఉన్నాయి. ఇప్పుడు ఆయన వాలంటీర్లపై పెట్టుకున్న నమ్మకం కూడా అలాగే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వాలంటీర్లే కీలకంగా సీఎం జగన్ నమ్మకం
వాలంటీర్ల వద్ద ప్రతి యాభై ఇళ్లకు సంబంధించిన సమాచారం ఉంటుది. వారికి ప్రభుత్వం ఆ యాభై ఇళ్ల పరిధిలో లబ్దిదారులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు పథకాల్లో పేర్లు ఉంచాలా తీసెయ్యాలా అనే అధికారం కూడా ఇచ్చారు. దీంతో వాలంటీర్లు చెప్పినట్లుగా ఓట్లు వేస్తారన్న అభిప్రాయం సీఎం జగన్ లో ఉందని.. పార్టీ నేతల చెప్పిన దాని కన్నా వాలంటీర్లు చెబితే ఎక్కువ ప్రభావితం అవుతారని భావిస్తున్నారు. అందుకే వాలంటీర్లపై నమ్మకం పెంచుకున్నారని చెబుతున్నారు.
Also Read: ఆక్వాలో 3,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు