Chintamaneni Prabhakar: సెంచరీకి చేరువలో చింతమనేనిపై క్రిమినల్ కేసులు - ఎన్నికల అఫిడవిట్‌లో కీలక వివరాలు

Denduluru News: ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న వేళ కొందరి నేర చరిత్ర విస్మయం కలిగిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఏకంగా 93 కేసులు ఉన్నాయి.

Continues below advertisement

Chintamaneni Prabhakar Election Affidavit: ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రాబోయే ఎన్నికల కోసం ఒక్కక్కరు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నామినేషన్  పత్రాల్లో అభ్యర్థి తమ ఆస్తిపాస్తుల వివరాలతో పాటు.. తమపై నమోదైన కేసుల వివరాలను కూడా ప్రస్తావించారు, అయితే ఏ పార్టీ అభ్యర్థి పైన లేనన్ని కేసులు చింతమనేని ప్రభాకర్ పైన తాజాగా కనిపిస్తున్నాయి! 

Continues below advertisement

గతంలో కేసులు 30, ఇప్పుడు 93

చింతమనేని ప్రభాకర్ పై రౌడీషీట్ తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరచరాస్తులన్నీ కలిపి సుమారు రూ.50 కోట్లు పైచిలుకు ఉన్నట్లు చింతమనేని చూపించారు. తహశీల్దార్ వనజాక్షి ఉదంతం సహా తనపై నమోదైన కేసుల వివరాలను  అఫిడవిట్లో చింతమనేని పొందుపరిచారు. అలాగే, మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడిచేసిన కేసులో చింతమనేని ప్రభాకర్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఇక చింతమనేని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో సుమారు రూ.50 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Also Read: ఎన్డీఏ కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లే - విశాఖలో సీఎం జగన్

డబ్బున్న వారిలో దేశంలోనే టీడీపీ ఎంపీ అభ్యర్థి టాప్

ఇక దేశంలోనే అత్యధిక సంపన్నుడైన ఎంపీ అభ్యర్థుల్లో టీడీపీ నేత, గుంటూరు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఈయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయన ఆస్తులు రూ.5,705 కోట్లకు పైగా ఉన్నాయి. సోమవారమే పెమ్మసాని తన నామినేషన్‌ను దాఖలు చేయడంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజ్యసభ, లోక్‌ సభలకు పోటీ చేసిన అభ్యర్థులలో అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖరే ఉన్నారు.

Also Read: పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

Continues below advertisement