Dead end for Andhra rapists: ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చాలా సార్లు బహిరంగ వేదికలపై హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కూడా ఇలా మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించడం లేదు. సోషల్ మీడియాలోనే కాదు..బయట కూడా మహిళలు, చిన్నారులపై ఘోరాలకు పాల్పడితే వారికి కఠిన శిక్షలు ఉంటాయనే అనే సంకేతాలు పంపుతున్నారు.
తునిలో కీచక వృద్ధుడు ఆత్మహత్య
తునిలో ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న బాలికపై ఓ వృద్ధుడు చేసిన దురాగతం విషయం బయటకు తెలిసిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. అయితే అతను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పోలీసులు చేసిన న్యాయం అని కొంత మంది అంటున్నారు. ఏది ఏమైనా ఆ వృద్ధుడు చేసిన తప్పు క్షమించరానిదని ఎక్కువ మంది అభిప్రాయం. ఈ ఘటనపై నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు. చివరికి నారాయణరావు ఆత్మహత్య చేసుకోవడంతో చంద్రబాబు చెప్పిన మాట నిజమైనట్లయింది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఏపీలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు పశ్చాత్తాపంతోనే.. అవమానాలను భరించలేకనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే 2018లో దాచేపల్లిలో ఓ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో నిందిడుతు పారిపోయాడు. తర్వాత అడవిలో ఉరి వేసుకుని చనిపోయాడు. తర్వాత 2 024లో అనకాపల్లి బాలికని హత్య చేసిన వ్యక్తి పురుగు మందు తాగి పొలాల్లో మరణించాడు. గత జూన్ లో కడపలో 3 ఏళ్ళ చిన్నారిని రేప్ చేసిన వాడు, మైలవరం డ్యాంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం సృష్టించిన ఇలాంటి నేరాల్ోల నిందితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. పోలీసులు కఠిన శిక్షలు విధిస్తారన్న భయంతో ప్రాణాలు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.
చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు - పోలీసుల కఠిన చర్యలు
అయితే ఇలాంటి ఘోరమైన నేరాలు చేసిన వారు ఎలా చనిపోయినా ఎవరూ సానుభూతి వ్యక్తం చేయడం లేదు. వారికి అలా జరగాలనే అంటున్నారు. ఆడబిడ్డలపై , పిల్లలపై ఘోరాలకు పాల్పడేవారికి ఇలాంటి శిక్షే పడాలన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వినిపిస్తోంది. చంద్రబాబు కూడా పోలీసులకు ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఇలాంటి నేరాలు చేసే వాళ్లకు పార్టీలు ఉండవని.. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాంటి నేరం చేసిన వారికి అదే ఆఖరి రోజు అవుతుందన్న సంకేతాలను బలంగా పంపుతున్నారు. నేరాలు చేయాలంటే నేరగాళ్లు కూడా భయపడేలా చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.