Cyclone Mentha made landfall near Kakinada:  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' (Cyclone Montha) కాకినాడ వద్ద తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తుపాను మచిలీపట్నం, కాకినాడ మధ్య  తీరాన్ని తాకింది. గాలి వేగం 80-90 కి.మీ/గంట మించి, తీవ్ర తుపానుగా మారింది.   3-4 గంటల్లో తీరాన్ని దాటుతుందని   IMD ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను తీరాన్ని దాటిన  తర్వాత, కొంత మందగించి ఒడిశా వైపు మళ్లుతుందని IMD అంచనా. 

Continues below advertisement

తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాడరేవు తీరంలో రాకాసి అలలు, కోతలు ఏర్పడ్డాయి. APSDMA ప్రకారం, 38,000 మందిని రిలీఫ్ క్యాంపులకు మార్చారు. లోతట్టు ప్రాంతాల్లో చిన్నారులు, వృద్ధులను ప్రాధాన్యతగా తీసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్టులు మూసివేశాయి. 43 ట్రైన్లు క్యాన్సల్, చెన్నై-హైదరాబాడ్ మార్గాల్లో డైవర్షన్లు. RTC బస్సులు ఆగిపోయాయి.  ఆంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. ఎమర్జెన్సీ స్టాఫ్‌కు  సెలవులు క్యాన్సిల్ చేశారు.  

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఎమర్జెన్సీ మీటింగ్‌లు నిర్వహించారు. NDRF 10 బృందాలు ఆంధ్రలో, 8 ఒడిశాలో మోహరించారు. రాష్ట్ర వైఆర్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించింది. "ప్రజలు ఇంటి లోపలే ఉండాలి. హెల్ప్‌లైన్ 1070కు కాల్ చేయండి" అని APSDMA సలహా ఇచ్చింది.  తుపాను ఆంధ్ర తీరాన్ని దాటిన తర్వాత, ఒడిశా వైపు మళ్లి, వర్షాలు కురిపించే అవకాశం ఉంది.