Anantapuram Tippu sultan Issue :  అనంతపురం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు డిప్యూటీ మేయర్ కోవటం విజయ భాస్కర్ రెడ్డి భూమిపూజ చేశారు.  టిప్పు సుల్తాన్ ట్రస్టు దీన్ని నిర్మిస్తోంది.  బిజెపి, బిజెపి అనుబంధ సంఘాలు ఈ భూమి పూజను తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందూ సంస్కృతిని రూపుమాపేందుకు టిప్పు సుల్తాన్ హిందువులపై దాడి చేశారని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడం ఏంటని బిజెపి అనుబంధ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 


నిర్మించి తీరుతామంటున్న డిప్యూటీ మేయర్ 


టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై డిప్యూటీ మేరు కూడా వెనక్కి తగ్గేదే లేదని మేయర్ ప్రకటించారు.ఈ అంశం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విగ్రహ ఏర్పాటు విషయంలో ఏకంగా డిప్యూటీ మేయర్ ఇంటిని బిజెపి అనుబంధ సంఘాలు ముట్టడించాయంటే ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బిజెపి , బిజెపి అనుబంధ సంఘాలు ఆది నుంచే దేశంలో ఎక్కడా టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని మొదటి నుంచే వారు ఈ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో  ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వైసిపి ఎమ్మెల్యే హాజరు కావడంతో బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం అనంతపురం నగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై తీవ్ర వివాదం నెలకొంది.


చరిత్ర తెలియకుండా వైసీపీ నేతల వ్యవహారం


చరిత్ర తెలియకుండా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని బిజెపి మండిపడుతోంది. గత చరిత్రలో టిప్పు సుల్తాన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందూ మహిళలపై అత్యాచారాలు చేశాడని.. మతం మారాలని హుకుం జారీ చేసి హిందువులను తీవ్రంగా హింసించాడని చెబుతున్నారు. మతం మారకపోతే చావే శరన్యామని వ్యవహరించిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావితరాలకు ఎలాంటి సంస్కృతి నేర్పిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. నగరంలో విగ్రహ ఏర్పాటు పై వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పకుండా విగ్రహాన్ని పగలగొట్టి తీరుతామని బీజేపీ , అనుబంధ సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.


టిప్పు సుల్తాన్ చరిత్ర హీనుడు కాదన్న డిప్యూటీ మేయర్ 


బిజెపి సంఘాల ఆరోపిస్తున్న విధంగా టిప్పు సుల్తాన్ చరిత్రహీనుడు కాదని  అనంతపురం డిప్యూటీ మేయర్ విజయ్ భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. భారత రాజ్యాంగంలో ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్ ఫోటోలతో కూడిన చరిత్ర కూడా చూసి.. నేర్చుకోవలన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా దీన్ని వాడుకోవాలని బిజెపి నేతల వ్యవహారం ఉందన్నారు. టిప్పు సుల్తాన్ ఈ దేశం కోసం పోరాడి ఆశులు భాషిను వ్యక్తి అని.. దేశం కోసం పోరాడి అశువులు బాసిన వ్యక్తుల ఫోటోలతో భారత రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం ఎంతో ఆదర్శంగా ఉందని ఇలాంటి దేశాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయాలని బిజెపి వ్యవహరిస్తుందని డిప్యూటీ మేయర్ కూడా విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు తన సొంత నిర్ణయం కాదని నగరంలోని టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చి కమిటీ సభ్యులు కలిసి విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా అందుకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.