విజయవాడలో వాణిజ్య ఉత్సవ్-2021 కార్యక్రమం ప్రారంభమైంది. పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని, ఎగ్జిబిషన్ హాళ్లను సీఎం పరిశీలించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు. చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించడమే వాణిజ్య ఉత్సవ్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
‘గత రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా పారిశ్రామికంగా రాష్ట్రం గణనీయ వృద్ధి సాధించింది. 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదైంది. 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రాష్ట్రానికి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నాను’ అని సీఎం జగన్ చెప్పారు.
రెండేళ్లలో రూ. 20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి ద్వారా 55 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైయస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 13 వేల కోట్ల పెట్టుబడితో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అనంతరం రాష్ట్ర ఎగుమతుల రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఈ-పోర్టల్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లా స్థాయుల్లో వాణిజ్య ఉత్సవాలు జరుగుతాయి.
రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు. చౌకగా ఎగుమతుల నిర్వహణకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించడమే వాణిజ్య ఉత్సవ్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్లు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాణిజ్య ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఎక్స్‌పోర్ట్ కాన్‌క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు.వాణిజ్యంతో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పోటీ పడే సత్తా రాష్ట్రానికి ఉందన్నారు మేకపాటి గౌతం రెడ్డి. వాణిజ్యం పెంపునకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని ఆయన చెప్పారు.