Nellore Rural Incharge Adala :   నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజవకర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి  ఆదాల ప్రభాకర్ రెడ్డినే ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి అదాల ప్రభాకర్ రెడ్డి సీఎం  జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. తర్వాత నియామక ప్రకటన విడుదల అయింది. 


నెల్లూరు రూరల్ నియోజకవర్గం   ఇన్ చార్జ్ విషయంలో మూడు రోజులుగా తర్జన భర్జనలు జరిగాయి. కోటంరెడ్డి బ్రదర్స్ ని గట్టిగా ఎదుర్కొని నిలబడేందుకు ఎవరైతే సరిపోతారా అనే విషయంలో అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు ఆదాలకు ఆ ప్లేస్ ఖరారు చేసింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నారు. దీంతో ఆయన కూడా ఆ సీటుపై సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోటంరెడ్డి బ్రదర్స్ నెల్లూరు రూరల్ లో బలంగా పాతుకుపోయారు. పార్టీ కేడర్ తో పాటు, తటస్థులు, సామాన్య ప్రజల్లో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డికి మంచి పేరుంది. ఆ పేరుతోనే వారు పార్టీ ఏదయినా, తమ గెలుపు ఖాయమనుకుంటున్నారు. వారికి అదాల చెక్ పెడతారని వైసీపీ 
 
నెల్లూరు  రూరల్  నియోజక వర్గ  నన్ను  నియమించినందుకు  సీఎం  జగన్  కు ధన్యవాదాలని..  ఇక  నుంచి  నెల్లూరు  రూరల్  ఇంన్చార్జ్  గా  బాధ్యతలు  నిర్వహిస్తానని అదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో అన్నారు. వైసీపీని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానన్నారు.  నెల్లూర్  రూరల్  నియోజక వర్గ ఇంఛార్జ్ గా నెల్లూరు  ఎంపీ  ఆదాల  ప్రభాకర్  రెడ్డి  ని  నియమిస్తూ  పార్టీ  అధ్యక్షుడు  జగన్  నిర్ణయం   తీసుకున్నారని..వచ్చే  అసెంబ్లీ  ఎన్నికల్లో  నెల్లూరు  రూరల్  నియోజక వర్గ  శాసన  సభ్యుడుగా  పోటీ  చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  వైసీపీ  కి  నెల్లూరు  రూరల్  లో  గెలవడం  నల్లేరు  పై  నడక  లాంటిదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదాల  తన  బాధ్యతలను  బాగా  నిర్వహిస్తారని  నమ్మకం  ఉంద్నారు. ఫోన్  ట్యాపింగ్   రుజువు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసంతృప్తి చిన్న వి,యమని..  త్వరలో  పరిష్కారం  అవుతుందని బాలినేని స్పష్టం చేశారు. 


నిజానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. టీడీపీలో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గానే ఉండేవారు. ఆయనకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ కూడా ప్రకటించారు. అయితే కాంట్రాక్టర్ అయిన ఆయన...  ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరైన  వెంటనే.. పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్‌సీపీలో చేరి ఎంపీగా పోటీ చేశారు. నెల్లూరు రూరల్‌లో చివరి క్షణంలో అభ్యర్థిని ఖరారు చేసుకుని టీడీపీ పోరాడాల్సి వచ్చింది. అదాల ఇలా పార్టీలు మారడం తరచూ జరిగేదే. అందుకే ఆయన తీరుపై వైఎస్ఆర్‌సీపీలోనూ అనుమానాలున్నాయి.