అన్వేషించండి

Chandrababu Nidadavolu: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ

women reservations: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో నిడదవోలులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పని చంద్రబాబు హెచ్చరించారు.

CM Chandrababu Naidu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ,ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా శనివారం ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా   చంద్రబాబు   మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన జ్వాల ఈ నిడదవోలు నుంచే మొదలైందని ప్రకటించారు.

 చారిత్రక వారసత్వం.. మహిళా శక్తి 

మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని ముఖ్యమంత్రి  తెలిపారు.  గతంలోనే దివంగత నేత నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చి వారిని రాజకీయంగా ఎదిగేలా చేశారని గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని, ఆడబిడ్డలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఇంటిని నిలబెడుతున్నారని వారి శక్తిని కొనియాడారు.

 కాంగ్రెస్ అడ్డంకులు.. ఇండియా కూటమి ద్వంద్వ నీతి 

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పిస్తే, కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు కావాలనే అడ్డుతగిలాయని ఆరోపించారు. మహిళలకు మేలు చేసే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి వారికున్న అభ్యంతరం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే ఈ పాటికే చారిత్రక చట్టం అమల్లోకి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.

 డీలిమిటేషన్ సాకుతో రాజకీయం 

దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా నష్టం జరుగుతుందనే వంకతో మహిళా బిల్లును అడ్డుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి వివరణ ఇచ్చారని, దక్షిణాది ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అన్నీ తెలిసినా రాజకీయ లబ్ధి కోసం బిల్లును అడ్డుకోవడం దేశాభివృద్ధికి విఘాతమని ఆవేదన వ్యక్తం చేశారు.  

 నిడదవోలు నుంచే పోరాటం మొదలు 

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ రోజు నిడదవోలులో జరిగిన నిరసన ర్యాలీ కేవలం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా మహిళలందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. నిడదవోలు పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.                                                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Jana Sena leader allegations: పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
Tamilnadu Updates: ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Peddi Trailer : పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Women Smoking Effects : అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
Labbaru Bomma Song Lyrics: లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
Vagina Health : యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
Embed widget