CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  శనివారం అమరావతిలో మీడియాతో  ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, అవినీతి నిర్మూలన వంటి కీలక అంశాలపై వివరాలను సీఎం పంచుకున్నారు.  

Continues below advertisement

మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు ప్రత్యేక  జోన్లు    

 మూడు ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.  ఈ ప్రాంతాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాము. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.  మూడు ప్రాంతాలు ఏవి, జోన్ల వివరాలు ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. ఉత్తరాంధ్ర,  కోస్తా , రాయలసీమ ప్రాంతాలకు జోన్లను ఏర్పాటు చేయవ్చచు.  ఈ జోన్ల ద్వారా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Continues below advertisement

అమరావతి  రైతులతో గ్యాప్ నిజమే  - మాట్లాడి కవర్ చేశాను                  రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్‌ ఉన్న  మాట నిజమేనన్నారు.  నాతో సమావేశం తర్వాత రైతులకు అన్నింటిపైనా స్పష్టత వచ్చింది.. రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. రెండో దశ భూసమీకరణ ఉపయోగాలను రైతులకు వివరించా.. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకూడదన్నారు.  అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారని సీఎం తెలిపారు.  త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుంది.. రాజధాని అభివృద్ధి ఇక అనస్టాపబుల్‌ అని స్పష్టం చేశారు.  రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని..  గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్నామన్నారు. సమీకరణ ఉపయోగాలను వారికి వివరించానననారు.           

పుష్కరాల నాటికి పోలవరం పూర్తి            

అమరావతి భూముల సమస్యలకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించామని సీఎం చెప్పారు.  ఈ అంశంపై కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నాం  అని సీఎం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, దీని ద్వారా ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చెప్పారు.  మునుపటి ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.     

మూడు ప్రత్యేక జోన్లు అంటే.. గతంలో మాదిరిగా ప్రత్యేక డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. వాటి ద్వారా సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది.