అన్వేషించండి

Pan IIT Summit: విజయవాడలో పాన్ ఐఐటీ సమ్మిట్.. ఆవిష్కరణలను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అమరావతి నుంచి భారత్ మోడల్ చూపిస్తామన్న మంత్రి లోకేశ్

Pan IIT Summit: విజయవాడలో పాన్ ఐఐటీ సమ్మిట్ వైభవంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో యువ ఐఐటీయన్లు, స్టార్టప్ సంస్థలు ప్రదర్శించిన ఆవిష్కరణలు సీఎం చంద్రబాబు పరిశీలించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విజయవాడలో పాన్ ఐఐటీ సమ్మిట్ ప్రారంభమైంది; సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
  • సీఎం డ్రోన్, ఈవీ మార్పిడి సహా పలు ఆవిష్కరణలను సందర్శించారు.
  • మంత్రి లోకేశ్: అమరావతి నుంచే భారత్ మోడల్ ఆవిష్కరణ లక్ష్యం.

Pan IIT Summit: విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో ప్రతిష్టాత్మకమైన 'పాన్ ఐఐటీ సమ్మిట్' (Pan IIT Summit) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ వేదికపై యువ ఐఐటీయన్లు, వివిధ స్టార్టప్ సంస్థలు ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి.

స్టాళ్ల సందర్శన.. ప్రత్యేక ఆకర్షణగా ప్రాజెక్టులు

  • సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఆవిష్కరణలను సీఎం తిలకించి, నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
  • ఆక్సి ఏరోస్పేస్ డ్రోన్: ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన లేటెస్ట్ డ్రోన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు ఆ డ్రోన్‌పై సీఎం స్వయంగా సంతకం చేయడం విశేషం.
  • పెట్రోల్ బైక్స్ టూ ఈవీ కన్వర్షన్: పెట్రోలుతో నడిచే టూ-వీలర్లను కేవలం గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చే సరికొత్త టెక్నాలజీని ప్రదర్శించిన స్టాల్‌ను సీఎం సందర్శించారు. ఈ విధానంపై ఆరా తీసిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా ఏపీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
  • హెల్త్ రిపోర్ట్ యాప్: కేవలం ఫేస్ స్కాన్ చేసిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య రిపోర్టును అందించే సరికొత్త యాప్‌ను రూపొందించిన స్టార్టప్ స్టాల్‌ను కూడా సీఎం సందర్శించి, వారి ప్రతిభను ప్రశంసించారు.
  • చిన్నారుల ఆవిష్కరణలు: 'స్వర్ణాంధ్ర-10 సూత్రాల' అమలులో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించవచ్చనే అంశంపై చిన్నారులు తమ ఆలోచనలను సీఎంకు వివరించారు. వారి ప్రతిభను మెచ్చిన చంద్రబాబు చిన్నారులను అభినందించి, వారితో కలిసి ప్రత్యేకంగా గ్రూప్ ఫోటో దిగారు.

    Also Read: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పు సవాల్‌

ప్రపంచానికి భారత్ మోడల్ చూపిద్దాం- మంత్రి నారా లోకేశ్

ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ మోడల్‌ను చూపిస్తామని, ఆ మోడల్ కచ్చితంగా అమరావతి నుంచే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

"ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం విభాగాల వారీగా 23 క్లస్టర్లను ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరప్‌లకు వందేళ్లు పట్టింది. కానీ, వచ్చే పదేళ్లలో భారత్ కూడా ఆ స్థాయికి చేరుకుంటుంది. ఆ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ అందరికన్నా ముందుంటుంది. ఈ అభివృద్ధి ప్రయాణంలో 'పాన్ ఐఐటీ' మాకు మార్గదర్శనం చేయాలని కోరుతున్నాను" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ సదస్సు రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి ఒక గొప్ప వేదికగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

Also Read: అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై పునఃపరిశీలనకు సీఎం చంద్రబాబు ఆదేశం

Frequently Asked Questions

పాన్ ఐఐటీ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైంది?

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో పాన్ ఐఐటీ సమ్మిట్ వైభవంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సమ్మిట్‌లో ప్రదర్శించిన కొన్ని ప్రముఖ ఆవిష్కరణలు ఏమిటి?

ఆక్సి ఏరోస్పేస్ డ్రోన్, పెట్రోల్ బైకులను ఈవీలుగా మార్చే టెక్నాలజీ, అలాగే ఫేస్ స్కాన్‌తో ఆరోగ్య రిపోర్ట్ ఇచ్చే యాప్ వంటివి ప్రదర్శించబడ్డాయి.

మంత్రి నారా లోకేశ్ సమ్మిట్‌లో ఏ విషయాన్ని నొక్కి చెప్పారు?

ప్రపంచానికి భారత్ మోడల్‌ను అమరావతి నుంచే చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉంచడమే తమ లక్ష్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి 23 క్లస్టర్లను ఏర్పాటు చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget