AP Cabinet Decisions | అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు శుభవార్తలు అందించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 సమస్యలను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2004 సెప్టెంబరు కంటే ముందు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికై, వివిధ కారణాల వల్ల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (CPS) అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని (OPS) వర్తింపజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 2020లోనే మెమో-57 జారీ చేసినప్పటికీ, గత ప్రభుత్వం దీనిని అమలు చేయలేదని మంత్రులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 10,715 మంది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పాత పెన్షన్ ప్రయోజనం పొందనున్నారు.

Continues below advertisement

ఒక్కో ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనంగతంలో 2017లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే నిర్ణయాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ 10 వేలకు పైగా ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించడం ద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 3.39 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభించనుంది. దీనివల్ల 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 34,850.83 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!

Continues below advertisement

రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయంమరో కీలక నిర్ణయంలో భాగంగా, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, షెడ్యూల్‌ 9, 10 పరిధిలోని సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వం ఈ ఫైల్ రెండుసార్లు తిరస్కరించినప్పటికీ, ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించగా, ఆయన కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2022 జనవరి నుంచి వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. దీనివల్ల ఇప్పటికే ఆయా సంస్థల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని, 62 ఏళ్లు నిండేవరకు కొనసాగనున్నారు ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్పొరేషన్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలుఏపీ మంత్రివర్గ సమావేశంలో పాత పెన్షన్ పునరుద్ధరణ (OPS), కార్పొరేషన్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం ద్వారా తమకు ఎంతో ఊరట, ఆర్థిక ప్రయోజనం కలిగిందని సీఎంకు వివరించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో ఏపీ ఐకాస ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.