Chandrababu Pawan Dinner Meet :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన చీప్ పవన్ కల్యాణ్ శనివారం డిన్నర్ మీట్ నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. చంద్రబాబు నివాసంలో రాత్రి 8గంటలకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంటికి డిన్నర్ మీట్ కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన, ఎవరు ఎన్ని స్థానాలలో ఎక్కడెక్కడ నుండి పోటీ చేయాలి అనే అంశాల పైన క్లారిటీ కి వచ్చే అవకాశం ఉంది.                 

  


అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంక్రాంతి పండుగ సంబరాలు మొదలైన వేళ, ఏపీలో సంక్రాంతి సంబరాలను ఇరువురు నేతలు కలిసి ప్రారంభిస్తారు. రేపు భోగి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మందడం లోని గోల్డెన్ రూల్ స్కూల్లో జరగనున్న భోగి వేడుకలలో పాల్గొంటారు. ఏపీలో వైసీపీ సర్కార్ తెచ్చిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇక ఈ రోజు రాత్రి డిన్నర్ మీట్లో దాదాపు రెండు గంటల పాటు వీరి చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.                                         


తెలుగుదేశం, జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా చర్చలు నిర్వహిస్తున్నాయని ఇప్పటికే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బలమైన స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. పట్టుదలకు పోయి  బలహీన స్థానాల్లో పోటీ చేయడం వైసీపీకి మేలు చేసినట్లవుతుందని..అందుకే పూర్తిగా బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు.  అయితే వ్యూహాత్మకంగా ఇంకా  ప్రకటన చేయలేదని.. సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.                      


టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తొలి జాబితాను సంక్రాంతికి ప్రకటించాలనుకుంటున్నారు. ఎలాంటి వివాదాలు లేని పాతిక సీట్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది జనసేనకు కేటాయిస్తారని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థుల కసరత్తును కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జనసేనలో చేరే నాయకుల సంఖ్య పెరిగింది. టిక్కెట్ కేటాయిస్తామంటే వైసీపీ నుంచే చేరే నేతలు ఎక్కువగానే ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఈ సారి విశ్వసనీయతకు.. పెద్ద పీట వేయాలనుకుంటున్నారు. గతంలో వైసీపీలో టిక్కెట్ దక్కక వచ్చిన రాపాక వరప్రసాద్ కు టిక్కెట్ ఇస్తే గెలిచిన వెంటనే ఆయన పవన్ పై విమర్శలు చేసి మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ప జంపింగ్ జపాంగ్స్ ను దూరం పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.