Davos: దావోస్‌ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట మొదలుపెట్టారు. ప్రపంచ ఉక్కు రారాజు, ఆరెస్సాల్లార్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. బావనపాడులో ఏర్పాటు చేయనున్న పెట్రో కెమికల్ హబ్‌(Petochemical Hub)లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా  సీఎం కోరారు. పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు అత్యంత అనుకూలమైన వ్యూహాత్మక ప్రదేశమని సీఎం లక్ష్మీ మిట్టల్‌కు  వివరించారు. బావనపాడు పోర్టు త్వరలోనే అందుబాటులోకి రానుందన్న చంద్రబాబు...దగ్గరలోనే వైజాగ్‌(Vizag)లో ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోలియా &ఎనర్జీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. రోడ్డు, రైల్వే, పోర్టు కనెక్టివిటికి  తిరుగులేదని...మౌలిక సదుపాయాల పరంగా ఆలోచించాల్సిన పనిలేదని సీఎం చంద్రబాబు లక్ష్మీమిట్టలకు వివరించారు.అన్నింటికీ మించి వ్యాపారవేత్తలకు ప్రభుత్వ మద్దతు దండిగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా వేధింపులు ఉండవని...సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని తెలిపారు. 
 
బావనపాడు-మూలపాటు ప్రాంతం తయారీ, ఆర్‌ అండ్‌ డి,లాజిస్టిక్స్ సౌకర్యాలు నెలకొల్పపాడనికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కణలకు ఎంతో మేలైన ప్రాంతం .కాబట్టి హెచ్‌పీసీఎల్‌-మిట్టల్ భాగస్వామ్య సంస్థ మిట్టల్ గ్రీన్‌ ఎనర్టీ లిమిటెడ్‌ రూ.3,500 కోట్లతో భారత్‌లో రెండు జిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ సెల్‌ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తుందని తెలిసిందన్న సీఎం....ఆ ప్లాంట్‌ ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా  లక్ష్మీ మిట్టల్‌ను చంద్రబాబు కోరారు. 2 వేల మందికి ఉపాధి  కల్పించే ఈ ప్లాంట్‌ ఏపీలో ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాల  సహాయ,సహకారాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
 
పెట్టుబడులకు ఆసక్తి
సీఎం చంద్రబాబు ప్రతిపాదనలపై లక్ష్మీమిట్టల్ (Lakshimi Mittal)సానుకూలంగా  స్పందించారు. భాగస్వామ్య సంస్థతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడలకు అత్యంత అనుకూల  రాష్ట్రామన్న లక్ష్మీమిట్టల్‌...ఆర్సెలర్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిస్పాన్‌ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో  గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ పరిశ్రమను ఏపీలో ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్లో  పెట్టబుడితో ఉక్కు పరిశ్రమ రానుందని ఆయన వెల్లడించారు.హైడ్రో పంప్‌స్టోరేజ్‌ ప్రాజెక్ట్ ఉపయోగించి 975 మెగావాట్ల సౌర,పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను గ్రీన్‌కో గ్రూప్‌తో కలిసి ఏర్పాటు చేస్తున్నామని...ఈ విద్యుత్‌ తాము కొత్త ఏర్పాటు చేసే స్టీల్‌ప్లాంట్‌కు  నిరంతరం  250 మెగావాట్లు సరఫరా చేయనున్నట్లు  మిట్టల్ వివరించారు. దీనివల్ల ఏటా 1.5 మిలియన్ టన్నులు కార్బన్ ఉద్గారాలు తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. 
 
డిన్నర్ మీటింగ్‌
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఐటీశాఖ మంత్రి లోకేశ్,కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌ హాజరయ్యారు.ప్రపంచంలోని వివిధ చోట్ల నుంచి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలకు పెట్టుబడుల అవకాశాలు, అనుకూలతలపై చర్చించేందుకు దావోస్‌ కాంగ్రెస్‌ సెంటర్‌ ప్లీనరీ హాలు లాబీలో నెట్‌వర్కింగ్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం హాజరైంది.ఏపీలో పెట్టుబడులకు  ఉన్న అనుకూలతలను  రాష్ట్ర ప్రతినిధుల బృందం వివరించింది.  రాయితీలు కల్పిస్తామని  హామీ ఇచ్చింది.