Chandrababu comments on Amaravati :   టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ లాంటి 1,000 మంది రాక్షసులు వచ్చినా సరే అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు.  గుంటూరు జిల్లాలోని తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు జగన్ పై పలు విమర్శలు చేశారు. 2019లో జగన్ కు ఓటు వేసి ప్రజలు తిక్కలోడికి అధికారం కట్టబెట్టారని.. దాని ఫలితంగా రాష్ట్రాలని రాజధాని లేకుండా పోయిందని దుయ్యబట్టారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచినా సరే.. మూడు మూక్కలాట ఆడుతున్నారే తప్పు మరేం చేయలేదన్నారు.


రాజధాని నిర్మాణం కోసం అమరావతిలోని 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాలను అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో రాజధానికి కేంద్రం కూడా సహకరించి.. నిధులు ముంజూరు చేసిందన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ, గుంటూరు జిల్లాలతో కలిపి అమరావతిని హైదరాబాద్ లా మార్చుదామని ప్లాన్స్ చేశామన్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపే చూశాయన్నారు.రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అని.. పెద్ద పెద్ద భవనాలు కాదన్నారు. అమరావతి రాజధానికి అక్కడి నుంచి ఎవ్వరూ మార్చలేరని పేర్కొన్నారు. ఎప్పటికైనా ఏపీ రాజధాని అమరావతేనని.. ఎవ్వరికీ సాధ్యం కానీ వాటిని కూడా.. టీడీపీ సుసాధ్యం చేస్తుందన్నారు. వైసీపీ ముడుపులు ఇవ్వలేకనే పలు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లాలో వైసీపీని ప్రజలు తరిమికొడతారన్నారు.


తాను సీఎంగా ఉండి ఉంటే పోలవరం నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ద్వారా వైసీపీపై కక్ష తీర్చుకునే మంచి అవకాశం వచ్చిందన్నారు. ఏపీ బాగుపడాలేంటే జగన్ సీఎం సీటు నుంచి వెంటనే దిగిపోయాలని, అది ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. కాగా, జూన్ 4న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు.  నాడు సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్ ను మహానగరంలా మార్చానని, హైదరాబాదులో 5 వేల ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించామని వివరించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉందంటే, ఆనాడు తాము వేసిన పునాదే కారణమని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
ఒకప్పుడు శాతవాహనులు ధరణికోట  ను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దేవతల రాజధాని కూడా అమరావతే. అలాంటి అమరావతి నగరం స్థాపించాలనుకున్నప్పుడు దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నుంచి, అన్ని మసీదుల నుంచి, అన్ని చర్చిల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాను. జగన్ వంటి ఇలాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి వెంట్రుక కూడా పీకలేరు. అమరావతి ముహూర్త బలం అది, అమరావతి స్థాన బలం అది.   జగన్ ఒక తిక్కలోడు... రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. తానేం చెప్పినా జగన్ నమ్మేస్తారని అనుకుంటున్నాడు. నాలుగు భవనాలు కడితే రాజధాని పూర్తయినట్టా? రైతులు చేసిన త్యాగం, పోరాటం ఫలితంగానే అమరావతి రాజధానిగా నిలిచింది, గెలిచింజన్నాకుయ  ఏపీ రాజధాని అమరావతి. నాతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. నరేంద్ర మోదీ నాయకత్వంలో మేం అనుకుంటే అమరావతి రాజధాని సజావుగా జరుగుతుందనడంలో సందేహమే లేదని స్పష్టం చేశారు.  
 
జూన్ 4న సగర్వంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున వేడుకలు  జరుపుకునే రోజు అది... సిద్ధమా? అదే రోజున జగనాసుర వధ, అమరావతి రక్షణ కూడా కూడా జరుగుతాయి. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. నాడు జగన్ అధికారంలోకి వచ్చాక, రూ.10 కోట్లతోమైన నిర్మితమైన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు. ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతోందో నాకు ఆ క్షణానే అర్థమైంది. మళ్లీ నేను వచ్చిన మరుక్షణమే ప్రజావేదిక పునర్ నిర్మిస్తాం. ప్రజా పాలనకు అక్కడ్నించే నాంది పలుకుతామన్నారు.  ఒక్క అమరావతి విషయంలోనే కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. తాడికొండ ప్రజాగళం ప్రచారసభకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు.