Chandrababu Arrest: స్కిల్ స్కాం కేసుపై సీబీఐ విచారణ చేపట్టాలి - హైకోర్టుకు వెళ్లిన ఉండవల్లి అరుణ్ కుమార్

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్ వేశారు. 

Continues below advertisement

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్ వేశారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.  ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై పోరాడుతున్న విషయం తెలసిందే. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, ఎండీ శైలజా కిరణ్ సంవత్సరాల తరబడి వస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూపులోని ఇతర సంస్థలకు మళ్లించారనే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. 

Continues below advertisement

మరోవైపు బాబు అరెస్టుపై అసెంబ్లీలో టీడీపీ ఆందోళనలు

అసెంబ్లీలో టీడీపీ సభ్యులు పోరాటం కొసనగాతోంది. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. మంత్రి అమర్‌నాథ్‌ లేచి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు.  సైకో ప్రభుత్వం అంటూ నినాదాలు చేయడంపై మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉన్న వారంతా అనుభవం ఉన్న వ్యక్తులేనని.. వారి నోటి వెంట ఇలాంటి పదాలు రావడం ఏంటని ప్రశ్నించారు. ఇదే కంటిన్యూ అయితే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. చంద్రబాబు కేసులపై అన్నింటినీ పూర్తిగా చర్చిద్దామని బుగ్గన అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించినప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. మరింత రెట్టించిన స్వరంతో సైకో ప్రభుత్వం పోవాలి... చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలా గట్టిగా నినాదాలు చేయడంతో బుగ్గన కూర్చోగానే మంత్రి అంబటి రాంబాబు లేచారు. 

టిడీపీ లీడర్లు ఇలా చేస్తుంటే తమ సభ్యుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాంబాబు హెచ్చరించారు. తాము మాట్లాడితే టీడీపీ లీడర్లు తట్టుకోలేరని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సభను మొదటిసారి స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం వాయిదా తర్వాత కూడా సభలో ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ సభ్యులు నినాదాలు కంటిన్యూ చేశారు. ఇంతలో వైసీపీ సభ్యులు, మంత్రులు లేచి టీడీపీ సభ్యులను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. సైకో పాలన పోయిందని.. ఖైదీగా జైల్లో ఉన్నారని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సైకోలు వచ్చి సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. బాలకృష్ణ కవర్‌ వేసుకొని వచ్చారని... దానిపై బాలకృష్ణ ఫొటో లేదని అన్నారు. సైకో అయిన వాళ్ల బావ జైల్లో ఉన్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని అన్నారు. సభలో అనుమతి లేకండా వీడియో షూట్ చేస్తున్నారని ఆరోపణలతో అచ్చెన్నాయుడు, అశోక్‌ను సస్పెండ్ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వారు బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు. రెండోసారి వాయిదా అనంతరం సభ ప్రారంభమైనా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో మరో ముగురిని స్పీకర్  సస్పెండ్ చేశారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola