Directors for corporations In Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఇదివరకే తొలి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. మొన్న రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ప్రభుత్వం. ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. ఆర్యవైశ్య, శెట్టిబలిజ, కురుబ, కళింగ, వన్యకుల, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున 90 మందిని నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్లగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
కళింగ కార్పోరేషన్
కళింగ కార్పొరేషన్‌లో 12 మంది టీడీపీ వారు, జనసేన నుంచి లోళ్ల రాజేష్ (ఇచ్చాపురం), పేదాడ రామ్మోహన్ రావు (ఆముదాలవలస), బీజేపీ నుంచి అత్తాడ రవి బాబ్జి (శ్రీకాకుళం) అవకాశం దక్కించుకున్నారు.
వన్యకుల క్షత్రియ కార్పోరేషన్
వన్యుల క్షత్రియ కార్పొరేషన్‌లో 12 మంది టీడీపీ నేతలకు అవకాశం లభించింది. జనసేన నుంచి బాలసుబ్రహ్మణ్యం (తిరుపతి), పెద్ద చిన్నప్ప వామన (కుప్పం), బీజేపీ నుంచి జీపాలెం తేజోవతి (తిరుపతి) అవకాశం దక్కించుకున్నారు.
శెట్టిబలిజ కార్పోరేషన్
కార్పొరేషన్‌లోనూ టీడీపీ నేతలు 12 మందికి అవకాశం లభించింది. ఇక జనసేన నుంచి జుట్టిగ నాగరాజు (ఉండి), పెంకె జగదీశ్ (పిఠాపురం), బీజేపీ నుంచి మట్టా మంగరాజు (కాకినాడ) నేత చోటు దక్కించుకున్నారు.
ఆర్యవైశ్య కార్పోరేషన్
ఆర్యవైశ్య కార్పొరేషన్‌లోనూ మొత్తం 15 మంది సభ్యులు కాగా, 12 మంది టీడీపీ నేతల్ని నియమించారు. జనసేన నుంచి దుగ్గిశెట్టి సుజయ్ బాబు (నెల్లూరు), కొల్లూరు రూప (విశాఖపట్నం), బీజేపీ నుంచి కుసుమంచి సుబ్బారావు (విజయనగరం) లను అవకాశం వరించింది.
అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్
అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ లో 15 మందిలో 12 మంది టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. జనసేన నుంచి తిరుమలశెట్టి చంద్రమౌళి (పెడన), తురంగి కాకినాడ రూరల్ నుంచి తిరుమణి కుమారస్వామి, బీజేపీ నుంచి విశ్వనాథ్ పల్లి వెంకటేశ్వర్లు (బాపట్ల) ను ఏపీ ప్రభుత్వం నియమించింది.