National highway between Badvelu and Nellore: కేంద్ర కేబినెట్ ఏపీకి మరో వరం ప్రకటించారు. సుదీర్గ కాలంగా ఎదురు చూస్తున్న బద్వేలు -నెల్లూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. ఈ రహదారి కోసం రూ.  3653 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్దతిలో నిర్మిస్తున్నారు. 

బద్వేలు-నెల్లూరు జాతీయ రహదారి 108 కి.మీ మేర ఉటుంది.   YSR కడప జిల్లాలోని గోపవరం గ్రామం ( నుంచి SPSR నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ జంక్షన్  వరకు ఈ హైవే ఉంది.  ఈ రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ముఖ్యమైన పారిశ్రామిక కారిడార్లకు కనెక్టివిటీని అందిస్తుంది.  విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్  లోని కొప్పర్తి నోడ్., హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్  లోని ఒర్వకల్ నోడ్ ,  చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్  లోని కృష్ణపట్నం నోడ్..   ఈ కనెక్టివిటీ లాజిస్టిక్స్ పనితీరు సూచిక  ని మెరుగుపరుస్తుంది, రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది.                                         

 ఈ రహదారి కృష్ణపట్నం పోర్ట్‌కు  స్ట్రాటజిక్ కనెక్టివిటీని అందిస్తుంది  వాణిజ్యం, ఎగుమతులు, మరియు దిగుమతులకు కీలకం. కృష్ణపట్నం పోర్ట్‌కు ప్రయాణ దూరాన్ని 142 కి.మీ. నుంచి 108.13 కి.మీ.కి తగ్గిస్తుంది,. దీనివల్ల ప్రయాణ సమయం ఒక గంట తగ్గుతుంది. ఈ రహదారి నిర్మాణం 20 లక్షల మాన్-డేస్ ప్రత్యక్ష ఉపాధి ,  23 లక్షల మాన్-డేస్ పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది.   ఈ కారిడార్ సమీపంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

బద్వేలు-నెల్లూరు 4-లేన్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్  రూ. 3,653.10 కోట్లను ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడ్‌లో అమలు  చేస్తారు.  బద్వేలు-నెల్లూరు మధ్య 4-లేన్ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. జమ్మలమడుగు-మైదుకూరు మధ్య 4-లేన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.  మొత్తం NH-67 కర్ణాటకలోని రామనగర్  నుంచి కృష్ణపట్నం పోర్ట్ ( వరకు 770 కి.మీ. విస్తరించి ఉంది, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 395.89 కి.మీ. ఉంది. 

కంద్రమంత్రి వర్గ భేటీలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరనుకూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.