APBJP :    ఆంధ్రప్రదేశ్ బీజేపీ .. వైసీపీపై సమరం ప్రకటించింది.   రాష్ట్ర వ్యాప్తంగా అభియోగాలు స్వీకరణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించి ప్రజల్లోకి వెళ్ళి చార్జ్ షీట్ లు వేసే పని ప్రారంభించింది.  బీేపీ రాష్ట్ర స్థాయిలో అభియోగాల స్వీకరణ  పై ప్రత్యేకంగా శ్రద్ద చూపిస్తోంది. ఆడియో , వీడియో సమావేశాల ద్వారా దశల వారీగా ఈ కార్యక్రమం పై ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సొము వీర్రాజు, అనేక అంశాలు పై నేతలకు మార్గదర్శనం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలో వచ్చి న ఫిర్యాదు లను ఈ సందర్బంగా వీర్రాజు తల ముందు ఉంచుతున్నారు .చార్జిషీట్ ప్రణాళిక మార్గదర్శక్ గా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పలు అంశాలను కాన్ఫరెన్స్ లో ఇప్పటికే ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అభియోగాలు నమోదు అనుసరించాల్సిన మార్గాలు పై జిల్లా నాయకత్వాలను అలర్ట్ చేస్తున్నారు.


26 జిల్లాల్లో చార్జ్ షీట్ కార్యక్రమాలు  


రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలపై   26 పార్లమెంట్ జిల్లాలలో చేపట్టిన ఛార్జ్ షీట్ కార్యక్రమం లో భాగంగా అన్ని జిల్లాల నుండి అభియోగాల స్వీకరణ ను  నేతలు ఇప్పటికే చేపట్టారు.జిల్లాల విభజన కూడా ఇప్పటికే జరగటంతో, గ్రామ స్దాయిలో చార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు .ప్రధానంగా రాయలసీమ జిల్లాలలో స్థానిక సమస్యలపై అభియోగాలు ఎక్కువగా ప్రజల నుండి వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. భూ సమస్యలు, భూ కబ్జాలు, రెవెన్యూ యంత్రాంగం అవినీతి పాలన....వంటి అంశాల వలన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాలపై అభియోగాలు వస్తున్నాయని కమిటీ కన్వీనర్ గా ఉన్న కోలా ఆనంద్ చెబుతున్నారు.  కక్షపూరితంగా చిన్నచిన్న తగాదాలపై కూడా పోలీస్ కేసులు ఫైల్ చేయడము ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కూడ చర్చగా మారిందని అంటున్నారు.  


ఇసుక సమస్యలు ! 
 
చిత్తూరు,  తిరుపతి జిల్లాలలో ఇసుక ఆగడాలు , చిన్నచిన్న కాలువలు, గుంటలు ,చెరువులు నుండి, సరిహద్దు రాష్ట్రాలకు ఇసుకను  తరలించడం కూడ భారతీయ జనతా పార్టి చార్జ్ షీట్ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి.స్దానికులు ఈ విషయాలను చార్జ్ షీట్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు.దీంతో ఇసుక సమస్య తీవ్రత రాష్ట్ర స్దాయిలో అంచనా వేసి,ఉద్యమం చేయాలని,లేదంటే ప్రభుత్వం వైఫల్యాలను గురించి ప్రజల్లో చైతన్య కార్యక్రమాల నిర్వాహణకు కూడ కాషాయ దళం ప్లాన్ చేస్తోంది.


ప్రజలతో కలసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం: విష్ణు వర్దన్ రెడ్డి


ఆశలు తీరుస్తారని అధికారం ఇస్తే దోపిడీకి లైసెన్స్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకుందని బీజేపి నేత విష్ణు వర్దన్ రెడ్డి ఆరోపించారు.వైసీపీ  నేతలు ఎక్కడ చూసినా దోపిడీ చేస్తున్నారని,పంచభూతాల్లో దేన్నీ వదలటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరిదీ దోపీడీ ఎజెండాగానే మారిందని అన్నారు.ఓ వైపు ఓటు బ్యాంక్ కోసం మత రాజకీయాలు - మరో వైపు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని,పథకాల పేరుతో ప్రజల్ని సోమరుల్ని చేసి యువశక్తి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.ప్రశ్నించిన వారి పై దాడులు , దౌర్జన్యలు చేయటం వంటి ఘటనలు జరుగుతుంటే, శాంతిభద్రతలు ప్రశ్నార్దకంగా మారాయని ఆయన అన్నారు.