Talliki Vandanam Phase 2: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధుల జమకు రంగం సిద్ధమైంది. మొదటి విడతలో వివిధ కారణాలు, కొత్త అడ్మిషన్ల వల్ల నిధులు అందని విద్యార్థుల కోసం పరిశీలనలు, ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో రెండో విడత లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 

Continues below advertisement

2వ విడతలో 3.29 లక్షల మంది 

మొదటి విడత నిధులు విడుదల సమయానికి పాఠశాలల్లో 1వ తరగతి, జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులు, అలాగే ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలలో సవరణలు చేసుకున్న విద్యార్థుల వివరాలను అధికారులు పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం, రెండో విడతలో మొత్తం 3,29,201 మంది అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది.  వీరికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.10,208.69 కోట్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కార్పొరేషన్ల వారీగా రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులు 

Continues below advertisement

 కార్పొరేషన్      -  అర్హులైన పిల్లలు    

  • AP మైనారిటీస్ కార్పొరేషన్ -    4,283  
  • ఆర్య వైశ్య కార్పొరేషన్-  3,708   
  • BC A కార్పొరేషన్-      53,506   
  • BC B కార్పొరేషన్   -   35,399     
  • BC C కార్పొరేషన్ -    874     
  •  BC D కార్పొరేషన్ -   43,317     
  •  BC E కార్పొరేషన్   -   25,252 
  •  బ్రాహ్మణ కార్పొరేషన్ -    1,583   
  •  EBC కార్పొరేషన్   -  7,180   
  • కమ్మ కార్పొరేషన్ -    6,889  
  • కాపు కార్పొరేషన్ -     25,963   
  • క్షత్రియ కార్పొరేషన్ -     1,104  
  •  రెడ్డి కార్పొరేషన్ -     11,201     
  • ఎస్సీ కార్పొరేషన్   -   74,760 
  •  ST కార్పొరేషన్   -   34,182  
  • మొత్తం విద్యార్థులు    -    3,29,201     

ఆర్థిక సాయం  

తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం.  ఇందులో రూ.13,000 నేరుగా తల్లి లేదా సంరక్షకుడి ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.  మిగిలిన రూ.2,000లను సంబంధిత స్కూల్ లేదా కాలేజీ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల నిర్వహణ నిధి కింద మినహాయిస్తారు. ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. Also Read: ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ

ఎవరు అర్హులు?

  1. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్స, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. 
  2. విద్యార్థికి కనీసం 75% పాఠశాల హాజరు తప్పనిసరి.
  3. కుటుంబ వార్షిక ఆదాయం, విద్యుత్ వినియోగం (300 యూనిట్ల కంటే తక్కువ), పరిమితికి లోబడి ఉన్న భూమి అనుగుణంగా ఉండాలి.
  4. లబ్ధిదారులు ఇవి చెక్ చేసుకోండి 
  5. డబ్బులు జమ అయ్యే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా లబ్ధిదారులు ఈ విషయాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
  6. తల్లి లేదా సంరక్షకురాలి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్, NPCI తో మ్యాప్ అయి ఉండాలి.
  7. మీ గ్రామ/వార్డు సచివాలయంలో లేదా విద్యాశాఖ పోర్టల్‌లో మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చేక్ చేసుకోవాలి. 
  8. నిధులు అకౌంట్ లో జమ అయిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్