AP Students in Manipur violence: అమరావతి: మణిపూర్‌లో అల్లర్లు కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక విమానంలో విద్యార్థులను, అక్కడ ఉంటున్న రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం విద్యార్థులను క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేక విమానంలో ఏపీ విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ ఏవియేషన్ శాఖ అందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రిగానీ, లేక సోమవారం ఉదయం గానీ ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానం బయలుదేరే అవకాశం ఉందని ఏపీ అధికారులు చెబుతున్నారు. 


ఇంఫాల్ నుంచి కోల్ కతా మీదుగా విజయవాడకు ప్రత్యేక విమానంలో ఏపీ విద్యార్థులను తీసుకురానున్నారు. ఒకవేళ విద్యార్థులు విశాఖకు చెందిన వారు ఎక్కువ ఉంటే అక్కడికి, లేక విజయవాడ సమీప ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉంటే విజయవాడకే మొదటగా తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏపీ భవన్ లో అధికారులతో చర్చించి, విద్యార్థులు సేకరించి వారిని మణిపూర్ నుంచి క్షేమంగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దాదాపు 150 మంది ఏపీ విద్యార్ధులు ఇంఫాల్ లో ఉన్న నిట్ లో, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చదువుతున్నట్టు గుర్తించారు. ఇంఫాల్ నుంచి మొదట కోల్ కతాకు తీసుకెళ్లి, అక్కడి నుంచి ఏపీకి తరలించేందుకు మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.


ఏపీ విద్యార్థుల సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే 
హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో ఏపీ విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. మణిపూర్‌లోని రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఏదైనా సహాయం అందించడానికి ప్రభుత్వం న్యూఢిల్లీలోని AP భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. హెల్ప్‌ లైన్ నంబర్లు  011-23384016,   011-23387089
మణిపూర్ హింసలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చిక్కుకున్నారు. తెలుగు విద్యార్థులు ఇంఫాల్ ఎన్ఐటీ సహా వేర్వేరు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. హింస, కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో జనజీవనం స్తంభించింది. విద్యార్థులు హాస్టల్ గదులు, అద్దె గదుల్లో ఆహారం లేక అలమటిస్తున్నారని తెలుగు ప్రభుత్వాలు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంఫాల్ నుంచి కోల్‌కత్తాకు ఇండిగో అదనపు విమాన సర్వీసులు నడుపుతోంది. మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 


హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సహాయాన్ని అందించడానికి మణిపూర్ ప్రభుత్వం, స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నవారికి సహాయం అందించడానికి మణిపూర్ లో ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటుచేశారు. 
1. 8399882392 - ఎంఎన్ మైఖేల్ అకోమ్, IRS
2. 9436034077 - రెహనుద్దీన్ చౌదరి, జాయింట్ సెక్రటరీ (హోమ్)
3. 7005257760 - పీటర్ సలాం, జాయింట్ సెక్రటరీ (హోమ్)
4. 8794475406 - డాక్టర్ టీహెచ్. చరణ్‌జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ (హోం)
5. 8730931414 - డా. మయెంగ్‌బామ్ వీటో సింగ్, డిప్యూటీ సెక్రటరీ (హోమ్)
6. 7085517602 - ఎస్. రుద్రనారాయణ సింగ్, డీఎస్పీ (హోమ్)