AP Rains Update | అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతాల్లో దిత్వా తుఫాను 12 కి.మీ వేగంతో ఉత్తరం వైపుకు కదిలి నేటి ఉదయం అదే ప్రాంతంపై, 11.4° ఉత్తర అక్షాంశం,  80.6° తూర్పు రేఖాంశం దగ్గర ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కడలూరు (భారతదేశం)కి తూర్పు-ఆగ్నేయంగా 100 కి.మీ., కరైకల్ కి తూర్పు-ఈశాన్యంగా 100 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కి.మీ., వేదరన్నియంకి ఈశాన్యంగా 140 కి.మీ., చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Continues below advertisement

ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుంచి దిత్వా తుఫాను కేంద్రం దాదాపు కనీసం 70 కి.మీ దూరంలోఉంది. ఇది  రాబోయే 18 గంటల్లో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం మధ్యాహ్నానికి కనీసం 60 కి.మీ, సాయంత్రానికి 30 కి.మీ దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది.

రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు 

Continues below advertisement

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంఈరోజు (నవంబర్ 30): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది. 

రేపు (డిసెంబర్ 1): అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.ఎల్లుండి (డిసెంబర్ 2): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ఈరోజు (నవంబర్ 30): చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో, గరిష్టంగా 70 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.రేపు (డిసెంబర్ 1): అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.ఎల్లుండి (డిసెంబర్ 2): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది.

రాయలసీమఈరోజు (నవంబర్ 30): చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో, గరిష్టంగా 70 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

రేపు (డిసెంబర్ 1): అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35-45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి (డిసెంబర్ 2): కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.