అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ Dino Deets పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా నారా- నందమూరి కుటుంబసభ్యులు నారా దేవాన్ష్‌కు విషెస్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన Dino Deets టీజర్‌లోనూ మంత్రి నారా లోకేష్ పాలుపంచుకుని కుమారుడు దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్, పాడ్ కాస్ట్ ప్రత్యేకతలు ఆసక్తిగా తెలుసుకున్నారు.
డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు- విశేషాలను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆకట్టుకునే శైలిలో, నవ్విస్తూ, ఆలోచింపజేసేలా పాడ్ కాస్ట్‌లు చేయనున్నాడు. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ నారా లోకేష్ తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఛానెల్ లింక్స్
YouTube - https://youtube.com/@dinodeets
Instagram - https://www.instagram.com/dinodeets/
Facebook - https://www.facebook.com/DinoDeets/
మనవడు దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్‌పై నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్మనవడు నారా దేవాన్ష్ (Nara Devaansh) డిజిటల్ ప్రపంచంలోకి సరికొత్త అడుగు వేశాడు. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి, 'పాడ్‌కాస్టర్' (Podcaster) గా మారుతున్నందున నానమ్మ నారా భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశాడు.. తన మనవడు చిన్న వయసులోనే ఒక కంటెంట్ క్రియేటర్‌గా మారి పాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టడంపై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నారా భువనేశ్వరి స్పందిస్తూ.. "మా చిన్నారి దేవాన్ష్ ఒక యంగ్ క్రియేటర్‌గా పాడ్‌కాస్టింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అలాగే తనకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ అయిన డైనోసార్స్ (Dinosaurs) గురించి దేవాన్ష్ అంతే ఆత్మవిశ్వాసంతో అందరికీ వివరిస్తూ, విషయాలను పంచుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. దేవాన్ష్‌కు నా హృదయపూర్వక ఆశీస్సులు. వచ్చే శుక్రవారం రోజు విడుదల కానున్న దేవాన్ష్ మొదటి ఎపిసోడ్ చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
యూట్యూబ్ చానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన నారా దేవాన్ష్ చెస్‌లో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా ఇదివరకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది నారా దేవాన్ష్ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడని తెలిసిందే.
