AP Local Elections: ఏపీలో కూటమి పార్టీలు స్థానిక ఎన్నికలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధిష్ఠానం.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతుంది. టీడీపీ కూడా ఎన్నికల కసరత్తును స్పీడప్ చేసింది. ఈ నెల 6, 7 తేదీల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏడు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ శిక్షణ తరగతులకు హాజరు కావాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది.  ఎన్నిక‌ల నిర్వహణ కసరత్తులో భాగంగా ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  ఇవాళ సాయంత్రం మంత్రులు, కీల‌క నేత‌ల‌తో సీఎం టింగ్ నిర్వహించ‌నున్నారు.  స్థానిక సంస్థల ఎన్నిక‌లు, మున్సిపాలిటీల్లో జ‌రుగుతున్న ప‌నులు, కూట‌మి పార్టీల స‌మ‌న్వయంపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.  

Continues below advertisement

వాయిదా వేసే ప్రసక్తే లేదు - మంత్రి లోకేష్ 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని, వాయిదా వేసే ప్రసక్తే లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో టీడీపీ మంత్రులతో ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎన్నికల గురించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తవుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసి, అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని మంత్రి లోకేష్ నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని మంత్రి లోకేష్ తెలిపారు.  Also Read: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !

మొదటిగా మున్సిపల్ ఎన్నికలు,  ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆపై పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించుకుని, అన్ని స్థానాల్లోనూ ఎన్నికలు నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన అర్హులందరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేస్తామన్నారు.   Also Read: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్

Continues below advertisement

అమల్లో ఉన్న జాబితాతోనే

ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితానే స్థానిక సంస్థల ఎన్నికలకు తుది జాబితాగా తీసుకోవాలని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి ఫోర్సులో ఉన్న, చెల్లుబాటయ్యే ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రాతిపదికగా తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.  ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదని ప్రభుత్వ  వైఖరిగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి అమల్లో ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కోర్టు నుంచి అభ్యంతరాలు వచ్చినా.. వాటిని అధిగమించే మార్గాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అవసరమైతే పార్టీ పరంగా కూడా బీసీలకు ఓసీ జనరల్ కేటగిరీలో సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. 

 Also Read: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి దసరా ఉత్సవాలు! ఏ రోజు ఏ అలంకారం?