అన్వేషించండి

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ - మనీలాండరింగ్ గుట్టు అంతా ఈడీ పట్టేసిందా? - జగన్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారా?

Raj Kesireddy ED Arrest: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో రాజ్ కేసిరెడ్డి ఇల్లు సహా 10 చోట్ల సోదాలు చేసింది. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది.

Hyderabad ED Raids: ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్   పరిధిలో జరిగిన వేల కోట్ల మద్యం రవాణా, సిండికేట్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పక్కా ఆధారాలతో రంగంలోకి దిగింది. గతంలో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేయడంతో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్‌పై వచ్చిన ఈ స్కామ్ సూత్రధారి, వైఎస్సార్‌సీపీ హయాం నాటి మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని ఇప్పుడు ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టుతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహిస్తుండటం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నానక్‌రామ్‌గూడలోని రాజ్ కేసిరెడ్డి నివాసంతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి.

మనీలాండరింగ్ కోణం గుట్టు రట్టు 

 ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ మనీలాండరింగ్ కేసు అత్యంత కీలకమైనదిగా మారుతోంది. కేవలం మద్యం పాలసీలోనే కాకుండా, లిక్కర్ సెంట్రలైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ టెండర్ల ద్వారా సుమారు రూ. 349 కోట్ల మేర అక్రమాలకు పాల్పడి, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలను ఫ్రంట్‌గా వాడుకుని, తెరవెనుక రాజ్ కేసిరెడ్డి సిండికేట్ 95 శాతం పైగా లాభాలను హవాలా, మనీలాండరింగ్ మార్గాల ద్వారా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులలోకి పెట్టుబడిగా మార్చినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఓల్విక్, అరోయో, ఈజీలోడ్ వంటి డమ్మీ కంపెనీల గుట్టును అధికారులు రట్టు చేసినట్లుగా తెలుస్తంది. 

రాజ్ కేసిరెడ్డికే అన్నీ  తెలుసని విజయసాయిరెడ్డి వాంగ్మూలం

ఈ కేసులో గతంలో ఈడీ జరిపిన ఏడు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం వైఎస్సార్‌సీపీ మాజీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఈ కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పాత్రను నేరుగా వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డే 'అన్నీ తానై నడిపిన అసలు పాత్రధారి' అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకే తాను సజ్జల శ్రీధర్ రెడ్డికి రూ. 100 కోట్లు సర్దాల్సి వచ్చిందని, విజయసాయిరెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇవ్వడం వైీసపీకి  కోలుకోలేని దెబ్బగా మారింది.

త్వరలో జగన్‌కు నోటీసులు? 

ఈడీ తాజాగా అటాచ్ చేసిన దాదాపు రూ. 441 కోట్ల విలువైన ఆస్తుల లంకెలు, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా ఆధారంగా ఈ కుంభకోణంలోని అన్ని వేళ్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వైపే చూపుతున్నాయని  భావిస్తున్నారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగం ద్వారా డిస్ట్రిలరీల నుంచి రూ. 3,500 కోట్ల మేర  ముడుపులు  వసూలు చేశారనే ఆరోపణలు, హవాలా లావాదేవీల లూప్‌ను ఈడీ బ్రేక్ చేయడంతో.. స్కామ్ వెనుక ఉన్న అసలు 'పెద్దల' చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. 

అంతిమ లబ్దిదారు ఎవరో క్లారిటీ వస్తుందా? 

రాజ్ కేసిరెడ్డి కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. మద్యం వ్యాపారంలో జే-బ్రాండ్స్ పేరిట నాసిరకం లిక్కర్ అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ సంపాదించిన ఈ వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము చివరకు ఏ ఏ ఖాతాల్లోకి వెళ్ళిందనే పూర్తి రూట్ మ్యాప్‌ను ఈడీ బహిర్గతం చేయనుంది.  త్వరలోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఈడీ విచారణ నోటీసులు జారీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget