ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్ కావడం వల్ల కార్యకలాపాలు చేయలేని పరిస్థితి నెలకొందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారంతా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 295 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ పరిస్థితే నెలకొందని సమాచారం. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఆ పనుల కోసం వచ్చిన వారు ఉదయం నుండి వేచి చూస్తున్నారు.


ఏపీలో జూన్ నెల మొదటి నుంచి భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో జనాలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇలా జనాలు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావడంతో అన్నీ కిక్కిరిసిపోయాయి. సరిగ్గా అదే సమయానికి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల జనం పడిగాపులు కాయాల్సి వస్తోంది.