అన్వేషించండి

AP ICET 2026 Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

AP ICET Results Direct Link | ఏపీ ఐసెట్‌ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 21,205 మంది అభ్యర్థులు ఐసెట్‌లో అర్హత సాధించారు.

AP ICET 2026 Results: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్‌ (AP ICET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం నాడు ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల నిరీక్షణకు తెరదించుతూ సాధ్యమైనంత త్వరగా ఏపీ ఐసెట్ 2026 ఫలితాలను ప్రకటించారు. ఏపీ ఐసెట్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://cets.apsche.ap.gov.in/icet/icet/ICET_GetResults.aspx

ఈ ఏడాది ఐసెట్ 2026 పరీక్ష కోసం మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,198 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 21,205 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు అర్హత సాధించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి 

అధికారిక వెబ్‌సైట్  https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx

ఈ ఫలితాలలో కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166.094 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఏపీ ఐసెట్ (AP ICET) అనేది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో MBA (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), MCA (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) పర్యవేక్షణలో ఏదో ఒక ప్రముఖ యూనివర్సిటీ ఏపీ ఐసెట్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హత ప్రమాణాలు 
అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్థానికత/ పోటీ నిబంధనలను కలిగి ఉండాలి.  ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

MBA కోసం: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 3 లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ (SC, ST, BC) అభ్యర్థులకు 45% మార్కులు ఉండాలి.

MCA కోసం: డిగ్రీతో పాటు, ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మార్కుల శాతం MBA తరహాలోనే (జనరల్ 50%, రిజర్వ్‌డ్ 45%) వర్తిస్తుంది.

Also Read: Best Country For MBBS : విదేశాల్లో MBBS చేయాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవడానికి ఏ దేశం బెస్ట్?

 AP ICET పరీక్షా విధానం 
ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT - Computer Based Test). సమయం: 150 నిమిషాలు కేటాయించారు

మొత్తం ప్రశ్నలు & మార్కులు: 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, 200 మార్కులు.

నెగటివ్ మార్కులు: ఈ పరీక్షలో ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు. తప్పు సమాధానాలకు మార్కులు కట్ చేయరు.

పరీక్షా ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది (కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ మాత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది).

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Deputy CM Pawan Kalyan: ఢిల్లీ మెడలు వంచుతాం అనే దక్షిణాది నేతలు అక్కడికి రాగానే భయపడతారు?: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మెడలు వంచుతాం అనే దక్షిణాది నేతలు అక్కడికి రాగానే భయపడతారు?: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Football World Cup: మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Embed widget