Matsyakarula sevalo: మత్స్యకారులకు ఏపీ సర్కార్ మెగా గుడ్ న్యూస్ - మంగళవారమే ఖాతాల్లోకి రూ. 20 వేలు.. నేరుగా నగదు జమ!
AP Fishermen: మత్స్యకార సేవలో నిధుల్ని మంగళవారం ప్రభుత్వం విడుదల చేయనుంది. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Fishermen Welfare Relief Fund : ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత మత్స్యకారుల కు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సముద్ర జలాల్లో చేపల వేట నిషేధ కాలం 61 రోజుల వేట నిషేధ సమయంలో, ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం మే 19, 2026 విడుదల చేయనుంది. గతంలో ఉన్న సాయాన్ని గణనీయంగా పెంచుతూ, ఒక్కో అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 చొప్పున ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.
మత్స్యకారుల సేవలో.. రెట్టింపు సాయం!
గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం తక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని రూ. 20 వేలకు పెంచుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది. సముద్రంలో వేట నిలిచిపోయిన ఈ రెండు నెలల కాలంలో నిత్యావసరాలు, కుటుంబ పోషణ కోసం ఇబ్బంది పడకుండా ఈ నగదు ఎంతో ఆసరాగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొమ్మిది తీరప్రాంత జిల్లాల్లోని వేలాది మంది మత్స్యకారులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
ఈ పథకం కింద అర్హులను ఎంపిక చేసేందుకు మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కఠినమైన నిబంధనలను పాటించారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై ఆధారపడి వేట సాగించే మత్స్యకారులను గుర్తించి, వారి ఆధార్ ,బ్యాంక్ వివరాలను సేకరించారు. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు సంబంధిత మత్స్యశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
రేపే నిధుల విడుదల - ఏర్పాట్లు పూర్తి
మే 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావలిలో అధికారికంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. వేట నిషేధ కాలం ముగిసేలోపే ఈ సాయం అందడం వల్ల మత్స్యకారులు తమ వలల మరమ్మతులు, బోట్ల మెయింటెనెన్స్ పనులకు కూడా ఈ మొత్తాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం పెంపు, డీజిల్ సబ్సిడీ పంపిణీ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. తీరప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కల్పన ద్వారా మత్స్యకారులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















