AP BJP:  ఏపీ బీజేపీలో అనంతపురం జిల్లా ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయన గిరిజనుల భూమిని కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు రావడం ..మంత్రి సత్యకుమార్ యాదవ్ కు సన్నిహితుడినని చెప్పుకుని దందాలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఆయనపై విచారణకు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో  రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను పలువురు బాధితులు కలిసి విచారణ చేయించాలని కోరారు. ఆదినారాయణ ఆక్రమాలపై సిట్ వేయాలని కోరారు.

సిట్ తో విచారణ చేయించాలని మంత్రిని కోరిన ఆదినారాయణ బాధితులు          

 సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం అడవి  బ్రాహ్మణపల్లి  తండాకు చెందిన పేద గిరిజన భూములను అక్రమంగా ఆక్రమించి వారి కుటుంబ సభ్యుల పేరు మీద   ఆన్లైన్ చేయించుకున్నారని ఆదినారాయణపై ఆరోపణలు ఉన్నాయి.  వాటి మీద పట్టాదారు  పాస్ పుస్తకాలు చేసుకుని   లోన్లు కూడా తీసుకున్నారు. ఈ లోన్లను గిరిజనులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. గతంలో వైసీపీలో ఉండేవారు. వైసీపీ అగ్రనేతలు తనకు సన్నిహితులని చెప్పి పెనుగొండ  కియా పరిశ్రమల వద్ద, లేపాక్షి చిలమత్తూరు  కోడికొండచెక్ పోస్ట్ వద్ద దాదాపు 90 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను   బంధువుల పేరు మీద  బినామీల పేరు మీద మార్పించుకున్నారని చెబుతున్నారు.  ఈ అక్రమాలన్నింటిపై  సిట్ నియమించి దర్యాప్తు చేయించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ను పలువురు బాధఇతులు కోరారు.   

విచారణ చేపట్టిన ఆర్డీవో              

మరో వైపు కబ్జా ఫిర్యాదులపై  ఆర్డీవో విచారణ చేపట్టారు.  బుధవారం ఆర్డిఓ మహేష్ అడవి బ్రాహ్మణపల్లి తండాలో  పర్యటించారు.  సర్వే నంబర్లకు సంబంధించిన వాటిని ఆర్డిఓ  పరిశఈలించారు.  బాధితులతో ఆర్డిఓ నేరుగా మాట్లాడారు. బాధితులు కు జరిగిన అన్యాయాన్ని విని తప్పక న్యాయం చేస్తామని చెప్పారు. సర్వేనెంబర్ 18 58-5,7,9,10,11, అదేవిధంగా 1809-2,1962,1963-1,3 సర్వేయర్ పొలములను స్వయంగా ఆర్డిఓ పరిశీలించారు. అటు అధికారులు చెప్పిన విషయాన్ని, బాధితులు చెప్పిన విషయాన్ని వారు పూర్తిగా విన్నారు. అనంతరం రెవెన్యూ రికార్డుల ప్రకారం పై తెలిపిన సర్వే నెంబర్లు  పూర్తి వివరాలను తెలియజేస్తూ, ఆర్డీవో కార్యాలయానికి నివేదిక పంపాలని ఎమ్మార్వోను ఆదేశించారు.  ఎమ్మార్వో ఇచ్చిన నివేదిక ప్రకారం అందరికీ న్యాయం చేకూర్చుతామని ఆర్డీవో తెలిపారు.     

మంత్రి సత్యకుమార్ అనుచరడని లైట్ తీసుకుంటున్న అధికారులు              

ఆదినారాయణ మంత్రి సత్యకుమార్ సన్నిహితుడిగా ప్రచారం జరుగుతూండటంతో అధికారులు  చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై  కమ్యూనిస్టు పార్టీలు సహా.. పలు పార్టీల ప్రతినిధులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు మద్దతు తెలుపుతున్నారు.           

Also Read: బీజేపీ వరుస విజయాల సీక్రెట్ కిషన్ రెడ్డి - తెర ముందు, తెర వెనుక వ్యూహాల్లో మాస్టర్ !