Andhra Pradesh government :  ఆంధ్రప్రదేశ్ బ్రాం్ దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.  పెట్టుబడులు రాకుండా.. సంపద సృష్టి జరగకుండా కొంత మంది గ్రూపులుగా మారి ఏపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ్నుమానిస్తోంది.  యూట్యూబ్ అకాడమీ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు గండికొట్టేలా ఇటీవల కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  శాంతిభద్రతలు లేవంటూ యూట్యూబ్, గూగుల్ కు ట్యాగ్ చేస్తూ పోస్టింగ్ లు పెట్టారు.  పెట్టుబడులు, అకాడమీలు పెట్టాలంటే హైదరాబాద్ కు వెళ్లాలని సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి  పోస్టింగులను ఇక ఏ మాత్రం సహించకూడదని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది. 






ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు సోషల్ మీడియా సైన్యంతో తప్పుడు  ప్రచారం                              


రాజకీయంగా చేసే ఆరోపణల విషయంలో ఏపీ ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. కానీ ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని నేరుగా ప్రచారం చేస్తూండటం.. ఏపీలో జరగని విషయాలను జరిగినట్లుగా.. ఏపీలో శాంతిభద్రతలు లేవన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రభుత్వ సీరియస్  గా పరిగణిస్తోంది. ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే.. రేపు మరింతగా విషం చిమ్ముతారరని అప్పుడు ఏపీకి మరింతగా నష్టం జరుగుతుందని అటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా ఉన్నారు. కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ఏపీపై పేక్ పోస్టులతో దాడి చేసే వారిని వదలొద్దని స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రత్యేకమైన విభాగం పెట్టాలని నిర్ణయించారు. 


వైసీపీ సానభూతిపరుల హస్తం ఉందని పోలీసుల అనుమానం                              


టీడీపీకి, ప్రభుత్వానికి నష్టం చేసేందుకు .. ఆంధ్రప్రదేశ్ పై విషయం చల్లె పోస్టుల వెనుక వైసీపీ సానుభూతి పరులు , ఆ పార్టీ నడుపుతున్న సోషల్ మీడియా సైన్యం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పోలీసులు పూర్తి వివరాలు సేకరించారని.. ఆధారాలు లేకుండా ఏపీ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టబోతున్నారని అంటున్నారు. 


36 హత్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్‌కూ నోటీసులు  ? 


మరో వైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఏపీలో ముఫ్పై ఆరు హత్యలంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ హత్యల వివరాలను ప్రభుత్వం అడిగినా అవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఫ్పై ఆరు హత్యల జరగలేదని కావాలని ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్ పైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించారు.